రామానాయుడి పేరిట అవార్డ్స్
శతాధిక చిత్రాల నిర్మాతగా గిన్నెస్ బుక్ లో చేటు సంపాదించుకున్న సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డాక్టర్ రామానాయుడు ఇక ఏటా తన పేరిట సినీ అవార్డులు ఇవ్వనున్నారు. ఉత్తమ హీరో, హీరోయిన్, నిర్మాత, దర్శకుడితో సహా వివిధ కేటగిరిలలో ప్రతిభ చూపిన వారిని గుర్తించి అవార్డులు అందజేస్తామని రామానాయుడు ప్రకటించారు.
రామానాయుడు ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ అవార్డులను అందజేస్తామనీ, ఇందుకోసం ఏర్పాటు చేసే కమిటీ అవార్డు విజేతలను ఎంపిక చేస్తుందనీ ఆయన తెలిపారు. ఈ ఏడాది నుంచే అవార్డుల ప్రదానం ఉంటుందన్నారు. తన తదుపరి చిత్రం విశేషాలను తెలియజేస్తూ, ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తమ తదుపరి చిత్రం ఉంటుందనీ, ఇందుకు సంబంధించిన కథ కూడా సిద్ధమైందనీ చెప్పారు. అల్లరి నరేష్ హీరోగా నటిస్తారని తెలిపారు. ఈ సినిమా తర్వాత మహిళా దర్శకురాలు బి.జయ డైరెక్షన్ లో మరో సినిమా ఉంటుందనీ, ఆ వివరాలను త్వరలోనే తెలయజేస్తామనీ అన్నారు.
Be first to comment on this News / Article!
|