'సమ్మక్క సారక్క' సెంచరీ
ప్రముఖ నటుడు బాబూమోహన్ తన కుమారుడు ఉదయ్ బాబును హీరోగా పరిచయం చేస్తూ వేముగంటి దర్శకత్వంలో నిర్మించిన 'శ్రీ మేడారం సమ్మక్క సారక్క మహాత్మ్యం' చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైద్రాబాద్ లోని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో అభినందన సభ జరిగింది. చిత్రయూనిట్ సహా పలువురు దర్శకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడూతూ, బాబూమోహన్ తన కుమారుడ్ని ఇతర రంగాల్లోకి దింపకుండా సినీరంగంలో పరిచయం చేయడం చాలా సంతోషం కలిగించిందనీ, నటల, ఫైట్స్ లో ఉదయ్ భాబు చూపిన ప్రతిభ తమిళ హీరో విజయ్ కాంత్ ను జ్ఞప్తికి తెచ్చిందనీ అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, బాబమోహన్ తో మనీషా ఫిలిమ్స్ కు ఎంతో అనుబంధం ఉందనీ, ఆయన రూపానికీ, హాస్యానికి సంబంధంలేదనీ, ప్రత్యేకమైన ఆర్టిస్టు ఆయనలో ఉన్నాడనీ అన్నారు. ఉదయ్ బాబు సైతం ఎవర్నీ అనుకరంచకుండా తనదైన పంథాలో నటించడం బాగుందని అభినందించారు. ఇది కొత్త వాళ్ల సినిమా అనిపించదనీ, ఉదయ్ బాబు మంచి ఈజ్ తో నటించాడనీ దర్శకుల సంఘం కార్యదర్శి రాంప్రసాద్ పేర్కొన్నారు. బాబూమోహన్ మాట్లాడుతూ, మొదట్లో ఈ చిత్రం ప్రమోషన్ విషయంలో తాను ఎన్నో బాధలు పడినప్పటికీ ప్రేక్షకాదరణతో 100 రోజులు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. భక్తి కథాంశంతో రూపొందించిన ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు నిర్మాత ఇందిరా విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర పరిశ్రమలో తన తండ్రి పేరు నిలబెట్టేందుకు తాను కష్టపడతానని ఉదయ్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు వేముగంటి, విలన్ పాత్రధరి గజని, నటుడు-రచయిత దురికి మోహన్ రావు, ప్రభాకర్, దర్శకులు కాశీవిశ్వనాధ్, అలహరి తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|