జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుజనుల జేజేలు అందుకున్న భగవాన్ శ్రీ షిర్డీ సాయిబాబా చరిత్రను వైవిధ్యంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా'. ఎస్.ఆర్.ఆర్. క్రియేషన్స్ బ్యానర్ పై బి.వి.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షిర్డీ సాయిబాబు పాత్రను కూడా ఆయనే పోషిస్తున్నారు. జి.రామకృష్ణ దర్శకుడు. అవుట్ డోర్ లో పాటల చిత్రీకరణతో ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.
షూటింగ్ ప్రారంభం రోజున చెప్పినట్టుగానే ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా షూటింగ్ పూర్తి చేసినట్టు బి.వి.రెడ్డి తెలిపారు. అవుట్ డోర్ చిత్రీకరణ కూడా అనుకున్న సమయంలోనే దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చినట్టు చెప్పారు. షిర్డీ సాయిబాబా పాత్రను పోషించడం తన అదృష్టంగా భావిస్తున్నాననీ, దర్శకుడు ఎంతో శ్రద్ధాసక్తులతో చిత్రాన్ని తెరకెక్కించారనీ పేర్కొన్నారు. ఈ చిత్రం రెండో షెడ్యూల్ ను కర్నూలు దగ్గర యాగంటి ప్రాంతంలో కొండల మధ్య జరిపినట్టు దర్శకుడు రామకృష్ణ తెలిపారు. సాయిబాబా పాత్రధారి బివిరెడ్డి, నారాయణరావు, నాగబాబు వంటి ప్రముఖ నటీనటులతో రెండు వందల మంది జనంతో పాటలు పూర్తి చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఎడిటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, త్వరలోనే ఆడియో విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుమన్, శివకృష్ణ, బ్రహ్మాజీ, రామిరెడ్డి, శివపార్వతి, రమాప్రభ, లక్ష్మి, రఘునాథరెడ్డి, సత్యారెడ్డి, చిట్టిబాబు, గుండు మనుమంతరావు, జెన్నీ సారిక రామచంద్రరావు తదితరులు నటించారు. కొమ్మనాపల్లి గణపతిరావు మాటలు, కె.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, మేనఘ శ్రీను ఎడిటింగ్, లలిత్ సురేష్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|