అర్జున్ 'జై సాంబశివ'
యాక్షన్ కింగ్ అర్జున్ ద్విపాత్రాభినయంలో తమిళంలో విడుదలై విజయవంతమైన 'తిరువణ్ణామలై' చిత్రం ఇప్పుడు తెలుగులో 'జై సాంబశివ' పేరుతో అనువాదమవుతోంది. పేరరసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కథానాయికగా పూజా గాంధీ నటించగా, డైలాగ్ కింగ్ సాయికుమార్ విలన్ పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని నిర్మాతలు గంగవరపు శ్రీనివాసులు నాయుడు, కె.హజరత్ రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఊరికి మంచి చేయాల్సిన ఎమ్మెల్యే తన కుమారుడికి హాని తలపెడతాడోమోనని కథానాయకుడి తల్లి భయపడుతుంటుందనీ, కొడుకు దుడుకుతనానికి కళ్లెం వేసేందుకు ఒక శైవక్షేత్రం తీసుకు వెళ్తుందనీ, అక్కడేమి జరిగిందనేదే ఈ చిత్ర కథ అనీ నిర్మాతలు తెలిపారు. చక్కటి కథా కథనాలతో ఈ చిత్రం తమిళనాట మంచి విజయం సాధించిందన్నారు. ఇందులో ఆరు పాటలు, ఏడు ఫైట్స్ ఉన్నాయనీ, ముఖ్యంగా అర్జున్, సాయికుమార్ లపై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయనీ చెప్పారు. ప్రస్తుతం డిటిఎస్ కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, ఇదే నెలాఖరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ చెప్పారు. ఈ చిత్రం సుధ, కరుణాస్ తదితరులు నటించారు. పేరరసు కథ, ఘంటసాల రత్నకుమార్ మాటలు, భువనచంద్ర-సాహితి పాటలు, శ్రీకాంత్ దేవా సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|