ప్రచారం ఉత్తదేః త్రిష
అందాల నటి త్రిష ఏదో కారణంగా ఎప్పటికప్పుడు వార్తల్లో నానుతూనే ఉంది. అయితే కొద్ది రోజులుగా ఆమె గురించి జరుగుతున్న ప్రచారం ఇటు పరిశ్రమలోనూ, అటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఎన్నికల ప్రచార బరిలోకి దిగనుందనీ, ఇందుకోసం 20 రోజుల పాటు కాల్షీట్లు ఇచ్చిందనే ప్రచారం గత వారం పది రోజులుగా జరుగుతోంది. పార్టీకి అవసరమైన గ్లామర్ అట్రాక్షన్ కోసం నాయకులు త్రిషను ఒప్పించారనీ, ఇందుకోసం ఆమె 2 కోట్లు పారితోషికం అందుకోనుందనీ ఆ వార్తల సారాంశం. ఇయితే ఇవన్నీ నిరాధారమైన వార్తలే నంటూ త్రిష తాజాగా ఖండించింది.
పార్టీ నాయకులు తనను కలిసారంటూ వస్తున్న వార్తలు తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తాయనీ, ఇవన్నీ కేవలం నిరాధారమైన వార్తలేననీ త్రిష వివరణ ఇచ్చింది. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ పైనే, కమిట్ అయిన సినిమాలపైనే ఉందని చెప్పుకొచ్చారు. తన చేతిలో చాలా మంచి ఆఫర్లు ఉన్నాయని తెలిపారు. మీ మీద తరచు వస్తున్న ఆరోపణలను సహజంగా ఎలా ఎదుర్కొంటారని అడిగినప్పుడు 'నవ్వుతూనే..' అంటూ త్రిష ఓ చిరునవ్వు విసిరింది. గుడ్ స్పిరిట్ కదూ...
Be first to comment on this News / Article!
|