ప్రియమణి కన్నడ ఎంట్రీ
ప్రియమణి ఇప్పుడు బహుభాషా నటిగా కూడా తన పరిధిని విస్తరించుకుంటోంది. 'పెళ్లయిన కొత్తలో' తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రియమణి ఈమధ్యనే 'ద్రోణ' చిత్రంలో ఒక పాటంతా బికినీతో కనిపించి యువప్రేక్షకులకు కనువిందుచేసింది. తమిళంలో భారతీరాజా 'కంగన్ లాల్ కైతు' చిత్రంతో పరిచయమై ఇటీవల విడుదలైన 'పరుత్తి వీరన్' చిత్రంతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డును కైవసం చేసుకుంది. ఆ చిత్రం తర్వాత ఎకాఎకిన మణిరత్నం తీస్తున్న'రావణ' చిత్రంలో ప్రియమణి ఎంపికైంది. తమిళ, హిందీ భాష్లలో ఈ చిత్రం రూపొందుతుండటంతో ప్రియమణి త్వరలోనే హిందీ ప్రేక్షకుల ముందుకు కూడా వెళ్లున్నట్టే. తాజాగా ఆమె చిరకాల స్వప్నమైన కన్నడ చిత్రంలో నటించే అవకాశం కూడా వెతుక్కుంటూ వచ్చింది. 'రామ్' పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరో కావడం విశేషం.
తెలుగులో విజయవంతమైన 'రెడీ' చిత్రానికి రీమేక్ గా 'రామ్' తెరకెక్కనుంది. మదేష్ దరశకత్వంలో ఆదిత్య రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కన్నడ సినిమాల్లో నటించాలనే కోరిక సరైన సమయంలో తీరడం సంతోషంగా ఉందని ప్రియమణి చెబుతోంది. 'పునీత్ నటించిన సినిమా ఒక్కటి కూడా పూర్తిగా చూడలేదు. అయితే ఆయన సినిమాల్లోని పాటలు టీవీలో చూశాను. చాలా మంచి డాన్సర్. ఒక సరైన ప్రాజెక్ట్ ద్వారా కన్నడంలో అడుగుపెడుతుండటం చాలా సంతోషంగా ఉంది' అని ప్రియమణి తెలిపింది. ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణతో కలిసి నటిస్తున్న 'మిత్రుడు' చిత్రంలో టాకీ పార్ట్ పూర్తి చేశాననీ, ఒక్క పాట చేయాల్సి ఉందనీ, అలాగే మణిరత్నం 'రావణ' చిత్రం కోసం పది రోజుల కాల్షీట్లు ఉన్నాయనీ తెలిపింది. వీటితో పాటు తమిళంలో రెండు చిత్రాలు వచ్చే నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ప్రియమణి 'రామ్' సైతం ఈ మంగళవారమే బెంగుళూరులో మొదలైంది.
Be first to comment on this News / Article!
|