ప్రేమ సంఘర్షణ 'జాజిమల్లి'
ప్రేమ ఎంతో మధురమైనది. అయితే పరిణతి చెందని వయసులో యువతీ యువకులు ప్రేమలో పడితే అది అనేక సమస్యలకు కారణమవుతుంటుంది. తల్లిదండ్రులను ఎదిరించి, చదువులతో పాటు జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్న నేటి యువత మానసిక సంఘర్షణకు అద్దం పట్టే చిత్రమే 'జాజిమల్లి'. బాలాదిత్య, దామినీ హీరో హీరోయిన్లు. శ్రీ శ్రీనివాస ఆర్ట్స్ మూవీస్ పతాకంపై ఎం.ఎస్.వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. వైకుంఠ లవ్య దర్శకుడు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 13వ తేదీ శుక్రవారంనాడు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.
యువతీ యవకుల మధ్య ప్రేమ సహజమనీ, అయితే పరిణితి లేని ప్రేమ వల్ల యువతకు అనునిత్యం ఎదురవుతున్న సమస్యలను ఇందులో చర్చించామనీ వైకుంఠ లవ్య తెలిపారు. ఇందులోని నటీనటులంతా చక్కటి ప్రతిభ కనబరిచారనీ, ప్రేక్షకులు సైతం ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉందనీ అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రంగనాథ్, జీవా, జయప్రకాష్ రెడ్డి, ఎం.ఎస్.నారాయణ, లక్ష్మీపతి, సుదర్శన్, చిత్రం శ్రీను, బబ్లూ, విజయకృష్ణ, ఆదిత్య నారాయణ, హరిత. సన, మాస్టర్ భరత్ కుమార్, మాస్టర్ దీపక్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి వైకుంఠ లవ్య కథ, మాటలు సైతం అందించగా, ఎం.వెంకట్ సినిమాటోగ్రఫీ, భేరి ఉమామహేష్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|