సమ్మర్ స్పెషల్ 'కరెంట్'
తొలిచిత్రం 'కాళిదాసు'తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగార్జున మేనల్లుడు సుశాంత్ ఇప్పుడు హైఓల్డేట్ యాక్షన్ హీరోగా 'కరెంట్' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీ నాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూర్యప్రతాప్ దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన పాటను ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో రిచ్ గా చిత్రీకరిస్తున్నారు. ప్రేమ్ రక్షిత నృత్యరీతులు సమకూరుస్తున్నారు. సుశాంత్, స్నేహ ఉల్లాలపై చిత్రీకరిస్తున్న ఈ పాట కోసం మూడు సెట్స్ వేశారు.
చిత్రం ప్రోగ్రస్ ను నిర్మాతలు తెలియజేస్తూ, లవ్ సబ్జెక్ట్ లో ఇదో కొత్ర ట్రెండ్ ను సృష్టించే సినిమా అవుతుందనీ, సుశాంత్ కెరీర్ ఇదో టర్నింగ్ పాయింట్ అవుతుందనీ చెప్పారు. దేవీశ్రీప్రసాద్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారనీ, పిక్చరైజేషన్ కూడా చాలా లావిష్ గా చేస్తున్నామనీ తెలిపారు. పాటల చిత్రీకరణ పూర్తి చేసి సమ్మర్ స్పెషల్ గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. సుశాంత్ లో మంచి ఈజ్ ఉందనీ, డాన్స్ సూపర్బ్ గా చేస్తున్నాడనీ ప్రేమ్ రక్షిత్ తెలిపారు. సినిమాలో ఈ సాంగ్ ఓ హైలైట్ గా నిలుస్తుందని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చరణ్ రాజ్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సునీల్ , షఫీ, రఘుబాబు, సుధ, ఝాన్సీ, విజయ్, కిషోర్, కొండవలస తదితరులు నటిస్తున్నారు. సూర్యప్రతాప్ కథ, విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ, కనల్ కణ్ణన్ ఫైట్స్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|