నిన్న థమ్సప్..నేడు నవరతన్
మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ అగ్రాసనం ఎవరిది కానుంది? నిజానికి క్రిష్టమైన ప్రశ్నే. నిలకడైన హిట్లు, ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోలు ఎవరూ లేకపోవడం వల్ల టాప్ చైర్ ఎవరనేది ఇప్పట్లో తేలక పోవచ్చు. 'పోకిరి' రికార్డులతో ప్రిన్స్ మహేష్ ఓ దశలో ఆశలు రేపితే, పవన్ 'జల్సా'తోనూ, ఎన్టీఆర్ 'యమదొంగ' తోనూ గట్టి సవాలే విసిరారు. ప్రస్తుతం ఈ పోటీ మాటెలా ఉన్న...యాడ్ సామ్రాజ్యంలో మాత్రం చిరంజీవి తర్వాత స్థానం మహేష్ దే అవుతోంది. నిన్నమొన్నటి వరకూ చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన థమ్సప్ ఆయన కాదనుకున్న తర్వాత నేరుగా మహేష్ చేతిల్లోకి వచ్చింది. ఇప్పడు చిరంజీవి పనిచేసిన మరో బ్రాండ్ కూడా మహేష్ ను వరించింది. కేవలం ఒక్కరూపాయి...అంటూ చిరంజీవి ప్రమోట్ చేసిన 'నవరతన్ ఆయిల్'కు మహేష్ ఇప్పుడు అఫీషియర్ అంబాసిడర్ గా పనిచేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా కుదిరినట్టు సమాచారం.
ఇందులో భాగంగానే మహేష్ రెండ్రోజుల క్రితం కౌలాలంపూర్ లో నవరతన్ హెయిర్ ఆయిల్ తాజా యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు. దీని తర్వాత మహేష్ తిరిగి హైద్రాబాద్ చేరుకుంటారు. నెలాఖరు నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న'వరుడు' చిత్రం పక్కా షెడ్యూల్ తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|