'తానా' కన్వెన్షన్ కు ఎన్టీఆర్
నందమూరి చిచ్చరపిడుగు ఎన్టీఆర్ తొలిసారి అమెరికాలోని తెలుగువారిని కలుసుకుని వారితో ముఖాముఖీ సంభాషించనున్నారు. చికాగాలో జూలై 1 నుంచి 4వ తేదీ వరకూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) దైవార్షిక సదస్సు-2009 కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరకాబోతున్నారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఎన్టీఆర్ తన అంగీకారం తెలిపినట్టు తాజా సమాచారం. తానా కన్వెన్షన్ కు టీనేజ్ సెన్సేషన్ రామ్, కామెడీ స్టార్ అల్లరి నరేష్ వంటి పలువురు హాజరవుతుండగా, నందమూరి యువకిషోరం ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. ఛార్మింగ్ అందాల ఛార్మి, కలర్స్ స్వాతి గ్లామర్ అట్రాక్షన్ గా ఈ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు.
రాజీవ్ కనకాల, సుమ, ఉత్తేజ, రఘుబాబుతో సహా పలువురు కమెడియన్లు ఈ సదస్సులో తమ పెర్ ఫారమెన్స్ తో అలరించనున్నారనీ, మురళీ మోహన్, సీనియర్ దర్శకుడు ఇవివి సత్యనారాయణ స్టార్ ఫెర్ ఫారమెన్స్ కు సారథ్యం వహించనున్నారనీ తెలిసింది.
Read 1 Comment(s) posted so far on this News / Article!
|