ఉగాదికి 'మినీ' ఫిల్మ్ ఫెస్ట్
హౌస్ పుల్
'ఆ నలుగురు', 'మధుమాసం' వంటి చిత్రాల దర్శకుడు చంద్రసిద్దార్ధ ఫిల్మోత్సవ్ బ్యానర్ పై నిర్మించిన 'హౌస్ పుల్' సైతం ఉగాది రిలీజ్ లతో పోటీపడనుంది. విపిన్, వేగ, ఆర్యన్, గౌరీ పండిట్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రానికి అజయ్ భూయాన్ దర్శకుడు.
రోమియో
గత కొంతకాలంగా సరైన హిట్ కోసం తపిస్తున్న ఆర్యన్ రాజేష్ 'రోమియో' గా ఉగాది రోజున ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. శ్రద్ధఆర్య, శ్రీహరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రామకృష్ణ దర్శకత్వంలో సుధ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఆనందతాండవం
'హ్యాపీడేస్ ' ఫేమ్ తమన్నా కథానాయికగా ఆస్కార్ ఫిలింస్ పతాకంపై వి.రవిచంద్రన్ నిర్మించిన ద్విభాషా చిత్రం 'ఆనందతాండవం'. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా విడుదల చేస్తున్నట్టు తెలుగు వెర్షన్ నిర్మాత ఎస్.వి.ఆర్. మీడియా అధినేత్రి శోభారాణి ప్రకటించారు. సిద్దార్ధ అనే కొత్త హీరో ఈ చిత్రంతో పరిచయమవుతున్నారు.
ఆకాశమంత
ప్రకాష్ రాజ్, త్రిష తండ్రీకూతుళ్లుగా నటించిన 'ఆకాశమంత' చిత్రాన్ని కూడా ఉగాది రోజున విడుదల చేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. తమిళంలో ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించగా, రాధామోహన్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు ఇదే చిత్రాన్ని కొంత రీషూట్ చేసి మిగిలినది యథాతథంగా ఉంచి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. జగపతిబాబు గెస్ట్ రోల్ పోషిస్తున్నారు.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|