ఫిలింసిటీలో 'ఆకూవక్కా'
భాగ్యరాజా తనయుడు శాంతన్ భాగ్యరాజా హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'సరే నీ ఇష్టం'. ఆంద్రిత కథానాయిక. పూర్ణచంద్ర మూవీ మేకర్స్ పతాకంపై మహేష్ చంద్ర (చంద్రమహేష్ ) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో శంతన్ , కౌష, 30 మంది డాన్సర్లలో 'ఆకూవక్క' అనే ఓ మాస్ పాటను రఘు నృత్యదర్శకత్వంలో ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. చిత్రం ప్రోగ్రస్ ను సెట్స్ లోనే చిత్రయూనిట్ తెలియజేసింది.
ఈ చిత్రం టాకీ పూర్తయిందనీ, ఇందులోని ఆరు పాటల్లో రెండు పాటలు బ్యాంకాక్, పుకెట్ , పటాయ్ లలో హీరోహీరోయిన్లపై తీశామని మహేష్ చంద్ర తెలిపారు. ఈమధ్యనే రామానాయుడు స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో హీరోహీరోయిన్ల ఒక రొమాంటిక్ సాంగ్, అలాగే హీరో 50 మంది డాన్సర్లు, 100 మంది జూనియర్ ఆర్టిస్టులతో మరో పాట తీశామనీ చెప్పారు. హీరోహీరోయిన్లకు సంబంధించిన రెండు రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలిందన్నారు. మరోవైపు డబ్బింగ్ 50 శాతం పూర్తయిందనీ, త్వరలోనే రీరికార్డింగ్ మొదలుపెడతామని చెప్పారు. ఈనెలలో ఆడియో, ఏప్రిల్ లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నాగబాబు, సాయాజీ షిండే, కోట, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, బాబూమోహన్, సన, కౌశ, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నారు. ఎ.విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ, హార్స్ మన్ బాబు ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్, చక్రి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|