నాని, మాధవీలతల చిత్రం
నాని (అష్టాచెమ్మా ఫేమ్) కథానాయకునిగా, మాధవీలత (నచ్చావులే ఫేమ్) నాయికగా ఓ వినోదాత్మక ప్రేమకథాచిత్రాన్ని జెమిని ఫిల్మ్ సర్యూట్ సమర్పణలో సత్యం ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తోంది. సత్యం బెల్లంకొండ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ప్రేమలోని భిన్న కోణాన్ని స్పృశిస్తూ, కేవలం ప్రేమ అనే అంశాన్ని మాత్రమే కాకుండా సకుటుంబ సమేతంగా చూసే పలు అంశాలతో వినోదాత్మకంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు. 'ప్రియమైన నీకు' చిత్రానికి సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు శివశంకర్ ఈ చిత్రంలోని ఆరు పాటలకు అందించిన మ్యూజిక్ ఈ చిత్ర విజయానికి మూలస్థంబం అవుతుందని అన్నారు. మాటల రచయిత భాషాశ్రీ ఈ చిత్రానికి పాటలు అందిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుని, ఈనెల 17న రెండవ షెడ్యూల్ కు సిద్ధమైందన్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు ఏప్రిల్ నెలాఖరు వరకు జరుగుతాయనీ, మే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఛాయాగ్రాహకుడు వాసు, మాటలు, పాటలు భాగశ్రీ, సంగీతం శివశంకర్, ఎడిటింగ్ మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం సత్యం ఎంటర్ టైన్ మెంట్స్, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం సత్యం బెల్లంకొండ.
Be first to comment on this News / Article!
|