జగన్మోహిని చివరి షెడ్యూల్
నమిత టైటిల్ పాత్రలో జగన్మోహిని చిత్ర్రాన్ని మురళి సినీ ఆర్ట్స్ పతాకంపై ఎన్.కె.విశ్వనాథన్ దర్శకత్వంలో హెచ్. మురళి తెలుగు, తమిళ బాషలలో నిర్మిస్తున్నారు. ఆదివారం నుండి ఈ చిత్రం చివరి షెడ్యూల్ ను రామోజీ ఫిలింసిటీలో జరపబోతున్నామనీ, మిగిలిన టాకీపార్ట్ ను పది రోజుల పాటు ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తామని మురళి చెప్పారు. తలకోన, పుత్తూరు, తదితర ప్రాంతాలలో ఇప్పటికే పాటల చిత్రీకరణ పూర్తయిందన్నారు. గ్రాఫిక్స్ హైలైట్ గా, సోషియో ఫాంటసీ చిత్రాలకు నిర్మాత సహకారంతో పాటు యూనిట్ సహకారం ఎంతో అవసరమని, తమకు అలాంటి మంచి టీమ్ జత కావడంతో చిత్రం బాగా రావడానికి ఎంతగానో దోహదపడిందన్నారు.
గతంలో జయమాలిని ప్రధాన పాత్రలో వచ్చిన జగన్మోహినికీ, మా చిత్ర కథకూ ఎలాంటి సంబంధం లేదు. నేటి ఆధునిక యువతకు నచ్చే విధంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు దర్శకులు ఎస్.కె.విశ్వనాథన్. యువరాజుగా రాజా, రాజుమదన్ బాబు సోదరిగా మీరాచోప్రా, రాజా తండ్రిగా నరసింహరాజు, మాంత్రికుడిగా కోట శ్రీనివాసరావు నటిస్తున్నారు. రచన వెన్నెలకంటి, సంగీతం ఇళయరాజా, నిర్మాత హె.చ్.మురళి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎన్.కె.విశ్వనాథన్.
Be first to comment on this News / Article!
|