మహేష్ 'వరుడు' మొదలైంది
ప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. 'అతడు' దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ తాజా చిత్రం 'వరుడు' ప్రచారార్భాటాలకు దూరంగా కనకరత్న మూవీస్ కార్యాలయంలో ముహూర్తం జరిగింది. ప్రముఖ ఫైనాన్సియర్, నిర్మాత సింగనమల రమేష్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22 లేదా 23 నుంచి ప్రారంభం కానుంది
'పోకిరి' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత వచ్చిన 'అతిథి' నిరాశపరచడంతో మహేష్ తన తదుపరి చిత్రం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వచ్చారు. అలాగే కథానాయికల ఎంపికలోనూ మహేష్ ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. తొలుత పార్వతి మిల్టన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినప్పటికీ ఆ తర్వాత జరిగిన మార్పులో పార్వతి స్థానంలో అనుష్క ఎంపికైంది. కేరెక్టర్ కు తగిన నటిని ఎంపిక చేయడంలో భాగంగా ప్రస్తుతం 'అరుంధతి' హిట్ తో మంచి డిమాండ్ లో ఉన్న అనుష్కను నిర్ణయించారు. మరో హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. ఇందులో మహేష్ స్నేహితుడుగా సునీల్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండబోతోంది. సునీల్ సరసన కలర్స్ స్వాతి ఎంపిక జరిగినట్టు ప్రచారం జరిగినప్పటికీ ఇందులో నిజం లేదని తెలుస్తోంది. తొలుత హైదరాబాద్ లో స్టంట్ మాస్టర్ విజయన్ నేతృత్వంలో కొన్ని ఫైట్స దృశ్యాలను చిత్రీకరించి ఆ తర్వాత రాజస్థాన్, నాసిక్, దక్షిణాఫ్రికాలలో 'వరుడు' షూటింగ్ షెడ్యూల్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|