యాడ్ ల్యాబ్స్ 'కాఫీ బార్'
'కోకిల', 'సంకీర్తన', 'కీచురాళ్లు' వంటి విభిన్న కథా చిత్రాలకు దర్శకత్వం వహించిన గీతాకృష్ణ కొద్ది విరామం తర్వాత బ్లూ ఫాక్స్ సినిమా పతాకంపై స్వీయద్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కాఫీ బార్'. ఈ చిత్రానికి ఆయన స్క్రీన్ ప్లే, సంగీతం కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం నలభై శాతానికి పైగా నిర్మాణం కూడా పూర్తి చేసుకుంది. అమెరికాలో ఈ చిత్రం ప్రదర్శించే హక్కులను ప్రముఖ పంపిమీ సంస్థ యాడ్ ల్యాబ్స్ అందిపుచ్చుకుంది. తాజ్ బంజారాలో గీతాకృష్ణ, యాడ్ ల్యాబ్స్ యుఎస్ఎ ప్రతినిధి ఉదయ్ కుమార్ తెలియజేశారు.
గీతా కృష్ణ మాట్లాడుతూ, చక్కటి థ్రిల్లింగ్ ఆంశాలతో కూడిన సామాజిక చిత్రమిదనీ, ఉగ్రవాదానికి సంబంధించి కొన్ని అంశాలున్నా నేటి యువతరం భావోద్వాగాలను కూడా ఈ చిత్రం ప్రతిబింబిస్తుందని చెప్పారు. దాదాపు అంతా కొత్త తారలే ఉంటారనీ, గిరీష్ కన్నాడ్, ఓంపురి వంటి ప్రముఖ తారలు కూడా ఇందులో నటిస్తున్నారనీ చెప్పారు. ఈ చిత్రం కోసం రెడ్ వాన్ అనే అత్యాధునిక కెమెరాను తొలిసారి ఇండియాలో ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ నెలాఖరుకు షూటింగ్ పూర్తి చేస్తామని చెప్పారు. ప్రవాస భారతీయల కోసం, ముఖ్యంగా ప్రవాసాంధ్రుల కోసం అమెరికాలో తమ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని ఉదయ్ కుమార్ తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో 250 థియేటర్ల వరకూ ఉన్నాయన్నారు. చక్కటి తెలుగు సినిమాలను అమెరికాలో విడుదల చేసి పరిశ్రమకు, ప్రవాసాంధ్రులకు సంధానకర్తగా వ్యవహరించాలన్నదే తమ సంస్థ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో యాడ్ ల్యాబ్స్ యుఎస్ఏ విభాగపు బిజినెస్ డవలప్ మెంట్ మేనేజర్ రామన్ సంచుల, డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్ సిఇఓ కె.బి.రెడ్డి సైతం పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|