'ఆనందతాండవం' పాటలు
సిద్దార్ద్, తమన్నా జంటగా ఆస్కార్ ఫిలిమ్స్ బ్యానర్ పై రవిచంద్రన్ నిర్మించిన ద్విభాషా చిత్రం 'ఆనందతాండవం'. ఎ.ఆర్.గాంధికృష్ణ దర్శకుడు.ఈ చిత్రం తెలుగు వెర్షన్ ను ఎస్విఆర్ మీడియా అధినేత్రి శోభారాణి ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో వేడుక శుక్రవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు, దర్శకులు వి.సముద్ర, భీమినేని శ్రీనివాసరావు, మహిళా దర్శకురాలు బి.జయ, మాటల రచయిత వెన్నెలకంటి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఆడియో సిడీని కె.ఎస్.రామారావు ఆవిష్కరించి అతిథులకు అందజేశారు. సోనీ బిఎంజి ద్వారా ఆడియో విడుదలైంది.
కె.ఎస్.రామారావు మాట్లాడుతూ, అభిరుచి గల నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ అనీ, ఆయన సినిమాలన్నీ శోభారాణి తెలుగులో విడుదల చేస్తూ విజయాలు సాధిస్తున్నారంటే ఆమె వ్యాపర దక్షత ఏమిటో అర్ధమవుతుందని అన్నారు. ఇలా వచ్చిన గత చిత్రాల తరహాలోనే ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. సముద్ర మాట్లాడుతూ, ఆస్కార్ రవిచంద్రన్ తో తనకు మంచి సాన్నిహిత్యం ఉందనీ, ఆయన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. శోభారాణి మాట్లాడుతూ, ఆస్కార్ రవిచంద్రన్ తీసిన చిత్రాలకు తెలుగులో తమన నిర్మాణ భాగస్వాములుగా ఎంచుకోవడం సంతోషం కలిగిస్తోందని, ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాననీ అన్నారు. ఇందులో తమన్నా ముఖ్య భూమిక పాత్ర పోషించగా, సిద్దార్ద్ హీరోగా పరిచయమవుతున్నాడనీ, వెన్నెలకంటి సంభాషణలు, భువనచంద్ర, వనమాలి, సుద్దాల అశోక్ తేజ పాటలు అందించగా, రెహమాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారనీ తెలిపారు. ఉగాది కానుకగా ఈ చిత్రం విడుదలవుతోందని అన్నారు. ఈ ఏడాది ఆస్కార్ బ్యానర్ పైనే తమ కుమారుడు రమణను హీరోగా పరిచయం చేయనున్నట్టు ఆమె వెల్లడించారు.
Be first to comment on this News / Article!
|