రఘుపతి వెంకయ్య విగ్రహం
తెలుగు చిత్ర పరిశ్రమ పితామహుడు రఘుపతి వెంకయ్య విగ్రహాన్ని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఆవిష్కరించనున్నారు. ఈనెల 15వ తేదీన రఘుపతి వెంకయ్య వర్దంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కె.ఎస్.రామారావు శనివారంనాడు తెలిపారు. ఫిల్మ నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన సమావేశంలో ఇంతవరకూ రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న డి.వి.ఎస్.రాజు, డాక్టర్ డి.రామానాయుడు, వి.బి.రాజేంద్ర ప్రసాద్, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, శ్రీమతి సి.కృష్ణవేణి తదితరులతో పాటు, నిర్మాతలు వై.హరికృష్ణ, కె.ఎస్.రామారావు, కె.బి.తిలక్, వెంకయ్య విగ్రహాన్ని చెక్కిన అంతర్జాతీయ మహిళా శిల్పి భద్రగరి ఉజయార్ (దేవికారాణి) తదితరులు పాల్గొన్నారు.
రఘుపతి వెంకయ్య స్మారకార్థం ఆయన విగ్రహాన్ని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఏర్పాటు చేస్తున్నట్టు కె.ఎస్.రామారావు ఈ సందర్భంగా తెలిపారు. కె.బి.తిలక్ మాట్లాడుతూ, వెంకయ్య వర్ధంతి సందర్భంగా రఘుపతి వెంకయ్య అకాడమీ స్థాపించనున్నట్టు చెప్పారు. ఈ అకాడమీ ద్వారా పరిశ్రమలోని అన్ని శాఖల సీనయర్లకూ లైఫ్ లైమ్ అఛీవ్ మెంట్ లు అందించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. వెంకయ్య విగ్రహావిష్కరణకు డాక్టర్ డి.రామనాయుడు పూర్తి సహకారం అందించారని తెలిపారు. అక్టోబర్ 15న వెంకయ్య జయంతి రోజున ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించామనీ, ఫిలింనగర్ సొసైటీలోని ఏదైనా కూడలిలో ప్రభుత్వ పర్మిషన్ తీసుకుని ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. రఘుపతి వెంకయ్య విగ్రహావిష్కరణ ఆయనకు అర్పిస్తున్న ఘన నివాళి అవుతుందని రామానాయుడు, డివిఎస్ రాజు, వి.బి.రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

Be first to comment on this News / Article!
|