శోభన్ బాబు కాంస్య విగ్రహం
ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని ఆయన కాంస్య విగ్రహావిష్కరణ రాజమండ్రిలో గోదావరి ఒడ్డున ఉన్న గౌతమి నందనవనంలో జరుగనుంది. ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు విగ్రహావిష్కరణ జరుగుతుందని శోభన్ బాబుతో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన రాశీ మూవీస్ అధినేత ఎమ్.నరసింహరావు తెలిపారు.
ఆంధ్రుల అందాల నటుడిగా, నటభూషణుడిగా ప్రేక్షకాభిమానుల హృదయాలలో శోభన్ బాబు చిరస్థాయిగా నిలుస్తారనీ, ఆయనతో తనకు, తన సంస్థకు ఎంతో సాన్నిహిత్యం ఉందనీ నరసింహారావు తెలిపారు. రాజమండ్రిలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పాలనే ఆలోచనతో తాను పలువురు ప్రముఖులను కలిసాననీ, తాను విగ్రహం ఖర్చులకు లక్ష రూపాయలు విరాళం ప్రకటించగానే పలువురు విరాళాలు ఇవ్వడంతో విగ్రహావిష్కరణ కోరిక నెరవేరిందన్నారు. డాక్టర్ దాసరి నారాయణరావు చేతుల మీదుగా 20వ తేదీన విగ్రహావిష్కరణ జరుగుతుందనీ, పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజమండ్రికి చెందిన శోభన్ బాబు సేవా సమితి నాయకులు కె.శ్రీనివాసకుమార్, పి.వి.శ్రీనివాసరావు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శోభన్ బాబు ఫ్యాన్స్ , స్థానిక రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారనీ చెప్పారు. అదేరోజు సాయంత్రం రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో శోభన్ బాబు వర్దంతి కార్యక్రమం కూడా జరుగుతుందని తెలిపారు.
Be first to comment on this News / Article!
|