సిద్దార్ధతో లగడపాటి చిత్రం
'ఎవడిగోల వాడిదే'కి, 'స్టైల్', 'వియ్యాలవారి కయ్యాలు' వంటి చిత్రాలను నిర్మించిన లగడపాటి శ్రీధర్ లార్ స్కో పతాకంపై యువహీరో సిద్దార్ధతో ఓ చిత్రాని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇందుకోసం సిద్దార్ధ 2 కోట్లు రెమ్యునరేషన్ కోరారనీ, అయితే ఒక కోటి 60 లక్షలు ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయనీ తెలుస్తోంది. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' చిత్రానికి ఇంతే మొత్తాన్ని సిద్దార్ధ తీసుకున్నారట.
సిద్దార్ధతో లగడపాటి ప్లాన్ చేస్తున్న చిత్రం ద్వారా ఒక కన్నడ దర్శకుడిని తెలుగు తెరకు పరిచయం చేయుబోతున్నారనీ, ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక కూడా జరుగుతోందనీ తెలుస్తోంది. సిద్దార్ధ ప్రస్తుతం 'ఓయ్' చిత్రంలో నటిస్తుండగా, లగడపాటి శ్రీధర్ సైతం మధుర శ్రీధర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ 'స్నేహగీతం' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే సిద్దార్ధ కాంబినేషన్ చిత్రం ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|