ఘనంగా శ్రీదేవి నిశ్చితార్ధం
విజయ్ కుమార్, మంజుల దంపతుల చిన్నకూతురు, నటి శ్రీదేవి వివాహ నిశ్చితార్ధం ఆదివారం రాత్రి 7.15 గంటలకు చెన్నైలోని స్వగృహంలో సంప్రదాయబద్ధంగా జరిగింది. తెలుగు, తమిళ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వధూవరులైన మంజుల, రాహుల్ ఒకరికొకరు పెళ్లి ఉంగారాలు తొడగడంతో ఎంగేజ్ మెంట్ కార్యక్రమం సందడిగా జరిగింది. వరుడు హైద్రాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని సొంతంగా నడుపుతున్నారు. విజయ్ కుమార్, మంజుల దంపతులతో పాటు వారి కుమారుడు, కుమార్తెలు సైతం నటులుగా ప్రతిభను చాటుకున్నే వారే కావడంతో సహజంగానే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సినీతారలు పాల్గొన్నారు.
నటులు పార్దీబన్, శరత్ కుమార్, రాధిక, కుష్బూ, ప్రభు, లక్ష్మీ, లత, మీనా, సంఘవి, సంగీత, కె.ఎస్.రవికుమార్, శంకర్ గణేష్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. జూన్ 18న శ్రీదేవి-రాహుల్ వివాహానికి ముహూర్తం నిశ్చయించారు.
Be first to comment on this News / Article!
|