పరేష్ కు గొల్లపూడి అవార్డు
గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ అవార్డు కింద ఏటా కొత్త దర్శకులకు ఇచ్చే అవార్డును ఈ ఏడాది మరాఠీ చిత్ర దర్శకుడు పరేష్ మొకషికి ప్రకటించారు. పరేష్ తొలిసారి దర్శకత్వం వహించిన 'హరీష్ చంద్రజీ ఫ్యాక్టరీ' చిత్రానికి గాను ఈ అవార్డు వరించింది. దేశ వ్యాప్తంగా 19 నామినేషన్లు ఈ అవార్డుకు పోటీపడ్డాయి. సింగీతం శ్రీనివాసరావు, కల్యాణరామన్, గొల్లపూడి మారుతీరావులతో కూడిన జ్యూరీ 'హరీష్ చంద్రజీ ఫ్యాక్టరీ' చిత్రాన్ని ఎంపిక చేసింది. ఈ అవార్డు కింద 1.5 లక్షల రూపాయల నగదు, మెమెంటో ప్రదానం చేస్తారు. ఆగస్టు 12న చెన్నైలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్టు గొల్లపూడి మారుతీరావు ప్రకటించారు.
ప్రముఖ నటుడు, రచయిత అయిన గొల్లపూడి మారుతీరావు తన కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ స్మారకార్థం ఈ అవార్డును నెలకొల్పారు. గొల్లపూడి శ్రీనివాస్ తొలి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కన్నుమూశారు. దీంతో తొలి చిత్ర దర్శకులకు 12 ఏళ్లుగా ఈ అవార్డును గొల్లపూడి మారుతీరావు అందజేస్తున్నారు. ఈ ఏడాది అవార్డును అందుకుంటున్న పరేష్ రెండు దశాబ్దాలుగా రంగస్థల అభివృద్ధికి పాడుపడుతున్నారు. వేదాలు, రామాయణ, మహాభారతాలపై కూడా రీసెర్చ్ వర్క్ చేస్తున్నారు.
Be first to comment on this News / Article!
|