బిందు ప్రేమకథ
శేఖర్ కమ్ముల నిర్మించిన 'ఆవకాయ్ బిర్యానీ' చిత్రంతో హీరోయిన్ గా పరిశ్రమలోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి బిందు మాధవి ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీ అవుతోంది. బిందు మాధవి హీరోయిన్ గా ప్రకాష్ వి.ప్రొడక్షన్స పతాకంపై వి.నాగేందర్ ఓ చిత్రాన్ని ఇప్పటికే అనౌన్స్ చేశారు. రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఈనెలలోనే సెట్స్ పైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా బింధుమాధవి హీరోయిన్ గా మరో కొత్త చిత్రాన్ని కూడా ప్రకటించారు. వీకకేపి ప్రొడక్షన్స్ పతాకంపై వి.కె.పి.నాయుడు ఈ కొత్త చిత్రాన్ని నిర్మించనున్నారు. 'ముహూర్తం' సినిమాతో ఉత్తమ తొలి చిత్ర దర్శకుడుగా నంది అవార్డును అందుకున్న రవి తెనాలి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. బిందు మాధవికి జోడిగా ప్రవీణ్ ('ముహూర్తం' ఫేమ్ ) నటించనున్నారు.
యువత మెచ్చే చక్కటి ప్రేమ కథా చిత్రమిదనీ, బింధు మాధవికి ఈ చిత్రం మంచిపేరు తెచ్చిపెడుతుందనీ దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో ఎనిమిది పాటలు ఉంటాయనీ, ఈనెల 21 నుంచి పాటల రికార్డింగ్ జరిపి, ఏప్రిల్ రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
Be first to comment on this News / Article!
|