'ఈనాడు'ను శృతి చేస్తుందట!
విలక్షణ నటుడు కమల్ హాసన్ ముద్దుల కూతురు శృతి కమల్ ఇప్పటికే గాయనిగా తమిళ చిత్రాల్లో తన సత్తా చాటుకుంటోంది. మొదట్లో సినీ ఫీల్డులోకి శృతి ఎంటర్ కావడం కమల్ కు ఇష్టం లేనప్పటికీ ఆమెలోని టాలెంట్, పట్టుదలను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దాంతో శృతి గాయనిగా తొలి అడుగు విజయంతంగా వేసింది. ఈమధ్యనే వచ్చిన 'సూర్య సన్నాఫ్ కృష్ణ'లో ఆమె తన గాత్రమాధుర్యం చవిచూపించింది. స్లిమ్ గా, ఫ్యాషన్ గా కనిపించే శృతి నటిగా బాలీవుడ్ లో 'లక్' చిత్రంతో తన అదృష్టాన్ని కూడా ఇప్పుడు పరీక్షించుకోనుంది.పనిలో పనిగా టాలీవుడ్ ఆశ కూడా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ఆమెను సంగీత దర్శకురాలిగా పరిచయం చేయాలనే ఆలోచనలో కమల్ ఉన్నారట. ఆ ఆలోచన వచ్చిందే తడవు కమల్ తన లేటెస్ట్ వెంచర్ 'ఈనాడు' కు నేపథ్య సంగీతం అందించే బాధ్యతను ఆమెకు అప్పగించినట్టు సమాచారం.
బాలీవుడ్ లో నసీరుద్దీన్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నీరజ్ పాండే దర్శకత్వంలో విజయవంతమైన 'ఎ వెన్స్ డే' చిత్రానికి రీమేక్ గా'ఈనాడు' చిత్రాన్ని మూడు భాషల్లో రీమేక్ చేసేందుకు కమల్ ప్లాన్ చేస్తున్నారు. మూడు భాషల్లోనూ కమల్ నసీరుద్దీన్ పాత్రను పోషించనుండగా, అనుపమ్ ఖేర్ పాత్రను తెలుగులో వెంకటేష్ పోషించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. కమల్ తన సొంత సంస్థ అయిన రాజ్ కమల్ బ్యానర్ పై యుటీవీతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పాటల్లేని ఈ మూడు వెర్షన్లకు శృతి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించే అవకాశాలున్నాయి. 'ఎ వెన్స్ డే' హక్కుల విషయంలో తలెత్తిన చిక్కులు తొలగినట్లయితే ఈనెలలోనే 'ఈనాడు' సెట్స్ పైకి వస్తుంది.
Be first to comment on this News / Article!
|