ఫిలింసిటీలో 'నేరము-శిక్ష'
కృష్ణ, విజయనిర్మల, జయసుధ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'నేరము శిక్ష'. అకుల్, ఆకర్షణ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. విజయకృష్ణ మూవీస్ పతాకంపై శ్రీమతి విజయనిర్మల స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం కోసం అకుల్, ఆకర్షణ జంటపై రామోజీ ఫిల్మ్ సిటీలో తాజాగా ఓ పాటను చిత్రీకరించారు. 'తెలిసినదే తలచినదే జరిగింది..జరిగినదే కనులెదుటే కలలాగే కదిలింది' అంటూ రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యానికి శీను నృత్య దర్శకత్వం వహించారు.
బొల్లిముంత నాగేశ్వరరావు రాసిన 'వల' నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందనీ, ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్, సస్పెన్స్ వంటివన్నీ మిళితమైన చిత్రమిదనీ విజయనిర్మల తెలిపారు. కృష్ణగారు నటించగా గతంలో ఇదే టైటిల్ తో వచ్చిన చిత్రం విజయవంతం కావడం, ఈ చిత్రానికి కథాపరంగా అదే సరిపోతుందని నిర్ణయించడంతో అదే టైటిల్ ను ఎంపిక చేశామన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో భాగంగా ఎడిటింగ్ పూర్తి కావచ్చిందనీ, డబ్బింగ్ కూడా ప్రారంభించనున్నామనీ చెప్పారు. ఐదు పాటలున్న ఈ చిత్రం ఆడియోను ఇదే నెలాఖరులోనూ, సినిమాను ఏప్రిల్ నెలాఖరులోనూ విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ధీరజ్, రూప, విజయ్ చందర్, బాలయ్య, గిరిబాబు, నిశ్చల్, రమాప్రభ, గీతాంజలి, శ్రీలక్ష్మి, బాలాజీ, సునీల్, జయప్రకాష్ రెడ్డి, ఏవిఎస్, రావికొండలరావు, రాధాకుమారి, నూతన్ ప్రసాద్ నటించారు. పరుచూరి బ్రదర్స్ మాటలు, వి.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, కోటి సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|