'బిల్లా' ఆడియోకి రజనీ
ప్రభాస్, అనుష్క జంటగా గోపీకృష్ణ మూవీస్ పతాకంపై యు.కృష్ణంరాజు సమర్పణలో రూపొందిన 'బిల్లా' చిత్రం సమ్మర్ సీజన్ లో మొదటిగా విడుదలవుతున్న భారీ బడ్జెట్ చిత్రం కానుంది. మెహర్ రమేష్ ('కంత్రీ' ఫేమ్ ) ఈ చిత్రానికి దర్శకుడు. షెడ్యూల్ ప్రకారమే ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బుధవారం సాయంత్రం శిల్పకలా వేదికపై ఈ చిత్రం ఆడియోను విడుదల చేయబోతున్నారు. లహరి ఆడియోస్ ద్వారా ఆడియో మార్కెట్ లోకి రాబోతోంది. ఈ ఫంక్షన్ కు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరుకాబోతున్నారనీ, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్లో గతంలో పనిచేసిన డైరెక్టర్లందరూ ఈ వేడుకలో పాల్గొంటారనీ తెలుస్తోంది.
తమిళ 'బిల్లా' చిత్రంలో రజనీకాంత్ ఒకప్పుడు నటించగా, ఇటీవల ఇదే పేరుతో వచ్చిన కొత్త వెర్షన్ లో అజిత్ నటించారు. హిందీ ఒరిజనల్ వెర్షన్ 'డాన్' కాగా, అప్పట్లో ఎన్టీఆర్ సైతం దీనికి రీమేక్ గా 'యుగంధర్' లో నటించారు. ఆయా చిత్రాల 'డాన్'లను ప్రభాస్ 'బిల్లా' ఆడియోకి రప్పించాలని మెహర్ రమేష్ ఆలోచన చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే వీరిలో రజనీకాంత్ అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రోబో' చిత్రం షూటింగ్ లో రజనీ పాల్గొంటున్నారు. ఆయన 'బిల్లా' ఆడియో ఫంక్షన్ లో పాల్గొనే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|