ఏడు పాత్రల 'ఆకాశరామన్న'
అల్లరి నరేష్, శివాజీ, రాజీవ్ కనకాల, గౌరీ పండిట్, మీరాజాస్మిన్ ప్రధాన పాత్రల్లో మన్యం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మన్యం రమేష్ నిర్మిస్తున్న చిత్రం 'ఆకాశరామన్న'. అశోక్ దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ మొదటివారంలో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మన్యం రమేష్ తెలిపారు. బుధవారంనాడు ఈ చిత్రం ట్రైలర్స్ ను ఫిలింఛాంబర్ లో మీడియాకు ప్రదర్శించారు.
మన్యం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తాము రూపొందిస్తున్న 5వ చిత్రం ఇందనీ, షూటింగ్ పూర్తయిందనీ రమేష్ తెలిపారు. ఇందులోని 7 పాత్రలు ఏడు కోణాల్లో వైవిధ్యంగా ఉంటాయనీ, మధుశర్మపై తీసిన సాంగ్ ఒక్కటే సినిమాలో ఉంటుందనీ చెప్పారు. ప్రమో కోసం ఓ స్పెషల్ సాంగ్ ను కూడా షూట్ చేశామన్నారు. సరిగ్గా 12.40 గంటలకు జరిగే ఒక సంఘటన చుట్టూనే కథ తిరుగుతుందనీ, అలాగని ఈ చిత్రం థ్రిల్లర్ ఎంతమాత్రం కాదనీ అన్నారు. పుష్కలమైన ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉందన్నారు. సినిమాటోగ్రఫీ, అశోక్ డైరెక్షన్ సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయని చెప్పారు. దర్శకుడు అశోక్ మాట్లాడుతూ, ఇది కాంప్లెక్ స్క్రీన్ ప్లే కూడిన ఇతివృత్తమైన్నప్పటికీ సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చిన మన్యం రమేష్ కు తన కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని అన్నారు. ఈ సినిమాలో రివర్స్ స్క్రీన్ ప్లే ఉపయోగించినట్టు చెప్పారు. ముందే క్లైమాక్స్ చెప్పి ఆ తర్వాత కథ చెప్పడమే ఈ రివర్స్ ఫార్ములా అని అన్నారు. అలాగని సినిమాలో ఎలాంటి గందరగోళం ఉండదని చెప్పారు. పాపం చేసినవాడు శిక్ష అనుభవించక తప్పదనే కర్మసిద్ధాంతం చుట్టూ కథ నడుస్తుందనీ, కావాల్సినంత ఎంటర్ టైన్ ఉందనీ వివరించారు.
Be first to comment on this News / Article!
|