వెబ్ సైట్ లవ్ 'స్వాతిచినుకు'
ప్రేమనేది ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కొక్కరి ప్రేమ కథ ఒక్కోలా ఉంటుంది. వెబ్ చాటింగ్ ద్వారా ప్రేమలో పడిన యువతీయువకుల ఇతివృత్తమే 'స్వాతిచినుకు'. వినీత్, మీరాజాస్మిన్ జంటగా తమిళంలో 'రాత్రిమళై' పేరుతో రూపొందిన చిత్రాన్ని ఆర్.పి.ఆర్.ఫిలిం ఫ్యాక్టరీ తెలుగులోకి అనువదించి ప్రేక్షకులకు అందించనుంది. ఇప్పటికే రికార్డింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ జరుపుకొంటోంది. హైద్రాబాద్ లోని రిథమ్ స్టూడియోస్ లో బుధవారంనాడు ఆ విశేషాలను చిత్రయూనిట్ తెలిపింది.
నృత్యం నేపథ్యంలో సాగే వినోదాత్మక సంగీత భరిత ప్రేమకథా చిత్రమిదని నిర్మాతలు సాదిరెడ్డి రామారావు, రామకృష్ణారావు బలుసు, పవన్ కుమార్ బాశింశెట్టి తెలిపారు. తెలుగు ప్రేక్షకులను తమ నటనతో ఆకట్టుకుంటున్న మీరాజాస్మిన్, వినీత్ లు ప్రేమజంటంగా అద్భుతంగా నటించారని చెప్పారు. సినిమాలోని ప్రతి ఫేమ్ ను దర్శకుడు లెనిన్ రాజేంద్రన్ ఎంతో హృద్యంగా తీర్చిదిద్దారని అన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ఆడియో, అదే నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో దియా, మనోజ్ కె.జయన్, చిత్ర అయ్యర్, లాలూ అలెక్స్ తదితరులు నటించారు. ఆర్.కె.ఆర్.బలుసు మాటలు, ఎస్.కుమార్ సినిమాటోగ్రఫీ, రమేష్ నారాయణన్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|