సాయిబాబా విశ్వరూపం
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా భక్తుల హృదయాల్లో కొలువైన షిర్డీ సాయిబాబా గురించి ఇతవరకూ తెరపై రాని అనేక అంశాలను స్పృశిస్తూ రూపొందుతున్న చిత్రం 'జగద్దురు శ్రీ షిర్డీ సాయిబాబా'. షిర్డీ సాయిబాబా పాత్రను బి.వి.రెడ్డి పోషిస్తూ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఆర్.ఆర్.క్రియేషన్స్ పతాకంపై యేలూరు సురేందర్ రెడ్డి సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి జి.రామకృష్ణ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ తో పాటు డబ్బింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఆ వివరాలను హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో చిత్రయూనిట్ బుధవారంనాడు తెలియజేసింది.
మొదట్నించీ అనుకున్న విధంగా సినిమాను పూర్తి చేయగలిగామనీ, ఇందులో సాయిబాబు విశ్వరూపం ప్రధాన హైలైట్ అవుతుందని బి.వి.రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా వివిధ దేవుళ్ల గెటప్స్ తాను ధరించనని చెప్పారు. ఈనెలలో ఆడియో, ఏప్రిల్ లో సినిమా విడుదలకు
సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. పాటలతో సహా సినిమా చాలా బాగా వచ్చిందని దర్శకుడు రామకృష్ణ పేర్కొన్నారు. గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ కు కూడా సినిమాలో ప్రాధాన్యం ఉందన్నారు. మాటల రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు, ఛాయాగ్రాహకుడు కె.శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నాగబాబు, సుమన్, శివకృష్ణ, నారాయణరావు, బ్రహ్మాజీ, రఘునాథరెడ్డి, రామిరెడ్డి, కోట శంకర్ రావు, గుండు హనుమంతరావు, హేమసుందర్, శివపార్వతి, రమాప్రభ తదితరులు నటించారు. లలిత్ సురేష్ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|