'ముదురు' ప్రేమలో శ్రియ
అందాలనటి శ్రియ ప్రేమలో పడింది. ఆమెను ప్రేమలో దింపిన కుర్రాడు ఆ ప్రేమను పణంగా పెట్టి పెద్ద వ్యాపారవేత్త అవ్వాలని అనుకుంటాడు. అతని కోరిక నేరవేరిందా లేదా తెలుసుకోవాలంటే 'శీనుగాడు మహాముదురు' చూడాల్సిందేనని అంటున్నారు చిత్ర నిర్మాతలు. ధనుష్, శ్రియ జంటగా తమిళంలో నటించిన 'తిరువిళైయాదల్ ఆరంబమ్' చిత్రం ఇప్పుడు తెలుగులో 'శీనుగాడు మహాముదురు' పేరుతో అనువాదమైంది. శ్రీ సౌదామిని క్రియేషన్స్ పతాకంపై కె.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.
బిజినెస్ మాగ్నెట్ కావాలనుకునే ఓ యువకుడు తన ప్రేమికురాలి సాయంతో ఎలా తన కలను సాకారం చేసుకున్నాడనే ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందిందనీ నిర్మాత సత్యనారాయణ తెలిపారు. ఇందులో ధనుష్, ప్రకాష్ రాజ్ తమ పాత్రల్లో నువ్వానేనా అన్నట్టు పోటాపోటీగా నటించారనీ, శ్రియ గ్లామర్ ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు.సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయనీ, ఈవారంలోనే ఆడియో విడుదల చేసి, ఏప్రిల్ 4న సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో శరణ్యం, మౌర్య తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించగా, జి.భూపతి పాండ్యన్ దర్శకత్వం వహించారు.
Be first to comment on this News / Article!
|