'యంగిస్థాన్' రామ్ చరణ్
తండ్రి మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్...అబ్బాయేమో యంగిస్థాన్. తండ్రి నుంచి డాన్సింగ్ స్కిల్స్, బాబాయ్ నుంచి బాడీ లాంగ్వేజ్...వెరసి యూత్ ఐకాన్ గా జనంలో ముద్ర వేయించుకునేందుకు రామ్ చరణ్ పట్టుదలగా ఉన్నారు. ఇందుకు తగ్గట్టే పవన్ కల్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసిన 'పెప్సీ' బాటిల్ ను ఆ సంస్థ ఇప్పుడు రామ్ చరణ్ చేతిలో పెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో యూత్ కు రామ్ చరణ్ కనికట్టు కడతాడని భావించిన శీతల పానీయాల సంస్థ పెప్సీ ఈసారి తమ బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్ ను రంగంలోకి దింపుతోంది. 'యంగిస్థాన్' నినాదంతో పెప్సీ తమ ప్రచారాన్ని శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇటీవలే ముంబై లో జరిగిన పెప్సీ యాడ్ షూటింగ్ లో చరణ్ పాల్గొన్నారు. చరణ్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే కూడా ఈ యాడ్ లో నటించింది. ఈ కమర్షియల్ యాడ్స్ త్వరలనే టీవీల్లో ప్రసారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
నటుడిగా తన తొలి కమర్షియల్ యాడ్ 'పెప్సీ' వంటి బిగ్గెస్ట్ బ్రాండ్ కు చేయడం పట్ల చరణ్ సంతోషాన్నివ్యక్తం చేశారు. డాడీ 'థమ్సప్', బాబాయ్ 'పెప్సీ' బ్రాండ్ అంబాసిడర్లుగా చేసినప్పుడు తన వంతు ఎప్పుడు వస్తుందా అనుకునేవాణ్ణనీ, ఇప్పుడు పెప్సీ తరఫున బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తుండటం సంతోషంగా ఉందనీ చరణ్ తెలిపారు. సినిమాలు, యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానంటూ తన పెద్ద మనసును కూడా చాటుకున్నారు. తండ్రి నినాదం సామాజిక న్యాయం అయితే, తనయుడు సామాజిక సేవకు సిద్ధం కావడం మెచ్చుకోలైన పరిణామమే.
Be first to comment on this News / Article!
|