'పోలీస్ పోలీస్' ఆడియో
శ్రీరామ్, ఫృధ్వీరాజ్, కమలిని ముఖర్జీ, సంజన ప్రధాన పాత్రల్లో మన్ మోహన్ దర్శకుడిగా పినాకిల్ పిక్చర్స్ పతాకంపై చందు నిర్మించిన కాప్ థ్రిల్లర్ 'పోలీస్ పోలీస్'. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. వేదికపై పోలీస్ స్టేషన్ సెట్ వేసి ఫంక్షన్ నిర్వహించడం అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆడియో సీడి, క్యాసెట్ లను రిలీజ్ చేసి తొలి ప్రతులను హీరో శ్రీరామ్ కు అందజేశారు. విశ్వ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలైంది.
శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, సంగీత దర్శకుడు విశ్వ తనకు పదేళ్లుగా ఉన్న పరిచయంతో ఈ ఫంక్షన్ కు హాజరయ్యాననీ, పాటల రచన, నేపథ్యగానం, డబ్బింగ్, సంగీతం ఇలా పలు రంగాల్లో మంచి ప్రతిభ అతనిలో ఉందనీ చెప్పారు. 'అరుంధతి'లో పశుపతి క్యారెక్టర్ కు విశ్వతో డబ్బింగ్ చెప్పించాలని అనుకున్నప్పటికీ ఆయన చాలా బిజీగా ఉండటంతో సాధ్యం కాలేదని అన్నారు. ఆడియోతో పాటు సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. చాలాకాలం తర్వాత తాను నటించిన స్ట్రయిట్ తెలుగు చిత్రమిదనీ, రొటీన్ పోలీస్ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఎంతో అనుభవమున్న వ్యక్తిలా తీర్చిదిద్దారనీ చెప్పారు. సాంగ్స్ చాలా బాగా వచ్చాయని, సాయి కార్తీక్ మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారనీ అన్నారు. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా సినిమా తీశారనీ, ఇంతవరకూ లవర్ బాయ్ పాత్రల్లో కనిపించిన శ్రీరామ్ ఇందులో పోలీసుగా షాకింగ్ పెర్ఫారమెన్స్ ఇచ్చారనీ నటుడు బ్రహ్మాజీ పేర్కొన్నారు. మంచి టెక్నికల్ వాల్యూస్ ఇందులో ఉన్నాయని విశ్వ పేర్కొనగా, ఇందులో ఒక సాంగ్ కు సంగీతం అందించడంతో పాటు సినిమాకు బ్రౌక్ గ్రౌండ్ అందిచానని సాయి కార్తీక్ తెలిపారు. ఈ సినిమాకు అందరూ కష్టపడి పనిచేసామనీ, అందరికీ మంచి గుర్తింపు కూడా వస్తుందనీ దర్శకుడు మన్ మోహన్ పేర్కొన్నారు. సినిమా మంచి హిట్టవుతుందనే ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ నిర్మాణపరంగా సహకరించిన మిత్రులందరికీ తన కృతజ్ఞతలని నిర్మాత చందు పేర్కొన్నారు. పలు కారణాల వల్ల సినిమా డిలే అయినా ఫైనల్ అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని చెప్పారు.
Be first to comment on this News / Article!
|