'అ ఆ ఇ ఈ' పాటలు
శ్రీకాంత్, మీరాజాస్మిన్, సదా హీరోహీరోయిన్లుగా శ్రీ కల్పన ఆర్ట్స్ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో బొద్దం అశోక్ యాదవ్ నిర్మిస్తున్న చిత్రం 'అ ఆ ఇ ఈ'. దీనికి 'అతను ఆమె ఇంతలో ఆమె' ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఇటీవలే ఈ చిత్రం లోగో ఆవిష్కరణ జరిగింది. తాజాగా శుక్రవారం రాత్రి జయబేరి గెస్ట్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో ఆడియో ఆవిష్కరణ జరిగింది. శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్, సదా, మీరాజాస్మిన్, సంగీత దర్శకురాలు శ్రీలేఖ, బి.ఆశోక్ యాదవ్, వి.వి.వినాయక్, ఏవీయస్, కవిత, గౌతంరాజు, కృష్ణభగవాన్, భాస్కర భట్ల, ఆర్.నారాయణమూర్తి, అల్లరి నరేష్, కాశీ విశ్వనాథ్, కృష్ణుడు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వి.వి.వినాయక్ ఆడియోను ఆవిష్కరించి తొలి ప్రతిని అల్లరి నరేష్ కు అందించారు. శ్రీలేఖ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది.
దర్శకుడు శ్రీనివాసరెడ్డి గత చిత్రాల తరహాలోనే ఇది కూడా మంచి వినోదాత్మక చిత్రంగా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నట్టు వి.వి.వినాయక్ పేర్కొన్నారు. యూనిట్ అందరికీ మంచి సక్సెస్ రావాలని ఆర్.నారాయణమూర్తి అభిలషించారు. 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'యమగోల మళ్లీ మొదలైంది' చిత్రాల కంటే పగడ్బందీగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారని నిర్మాత అశోక్ యాదవ్ తెలిపారు. తన కెరీర్ లో ఇది బెస్ట్ ఫిల్మ్ అవుతుందని, బలమైన కథాంశంతో ఈ సినిమా చేశాననీ, తన కాంబినేషన్ లో శ్రీలేఖకు ఇది నాలుగో చిత్రమని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హాస్యనటుడు ఏవీఎస్ కు ఇటీవల ఎంతో నిస్వార్థంగా కిడ్నీ ఇచ్చిన ఆయన కుమార్తె శాంతితో పాటు ఆమె భర్త శ్రీనివాసులను ఇదే వేడుకలో చిత్రయూనిట్ సన్మానించింది.
Be first to comment on this News / Article!
|