బన్నీ చిత్రంలో ఆర్య విలన్
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, సంచలన దర్శకుడు గుణశేఖర్ కాంబినేషన్ లో యూనివర్శల్ మీడియో పతాకంపై డివివి దానయ్య నిర్మించనున్న భారీ చిత్రం ఈనెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతోంది. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో ఆర్య కీలకమైన విలన్ పాత్ర పోషించనున్నట్టు దర్శకనిర్మాతలు వెల్లడించారు.
అల్లు అర్జున్ కు ఉన్న యూత్, మాస్ ఇమేజ్ ను మిస్ కాకుండా ఒక కొత్త కోణంలో ఆయనను గుణశేఖర్ చూపించబోతున్నారనీ, బన్నీ కెరీర్ లోనే ఇది సెన్సేషన్ ఫిల్మ్ అవుతుందనీ నిర్మాత దానయ్య తెలిపారు. ఇందులో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందనీ, ఆ పాత్ర కోసం చాలామందిని అనుకున్నప్పటికీ తమిళ హీరో ఆర్య అయితే బాగుంటుందనిపించి ఆయనను సంప్రదించామనీ, గుణశేఖర్ చెప్పన కథ, విలనీ పాత్ర ఎంతగానో నచ్చి ఆ పాత్ర చేయడానికి ఆర్య అంగీకరించారనీ చెప్పారు. తమిళ 'నాన్ కడవుల్ 'తో స్టార్ హీరోగా ఎదిగిన ఆర్య ప్రస్తుతం అక్కడ 'పర్వ', 'మదరాసు పట్టణం' చిత్రాలతో పాటు మరో రెండు బిగ్ ప్రాజెక్ట్ లలో హీరోగా నటిస్తున్నారనీ, అయినప్పటికీ పాత్ర వినగానే తమకు డేట్స్ అడ్జెస్ట్ చేశారని చెప్పారు. అల్లు అర్జున్, ఆర్యల మధ్య వచ్చే కొన్ని సీన్స్ ఎక్స్ టార్డినరీగా ఉంటాయన్నారు. ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్ ని పరిచయం చేస్తున్నామని తెలిపారు. దాదాపు 8 నెలల పాటు గుణశేఖర్ ఈ సినిమా కోసం ప్రీ పొడక్షన్ చేసి ఎంతో పగడ్బందీగా సినిమాను ప్లాన్ చేశారనీ, 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలై నాన్ స్టాప్ షెడ్యుల్ తో ఆగస్టుకు పూర్తవుతుందని చెప్పారు. ఇది బన్నీకి, నిర్మతకు, తనకూ కూడా మంచి పేరు తెచ్చే చిత్రమవుతుందని గుణశేఖర్ తెలిపారు. ఈ చిత్రానికి వేటూరి పాటలు, ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, అశోక్ కళాదర్శకత్వం, స్టన్ శివ ఫైట్స్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|