రవితేజ 'ఆంజనేయులు'
రవితేజ కథానాయకుడుగా 'ఆంజనేయులు' అనే కొత్త చిత్రం ప్రారంభమైంది. పరశురామ్ ('యువత' ఫేమ్ ) దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నటుడు గణేష్ బాబు తొలిసారిగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియోస్ లో ఆదివారం ఉదయం 7.30 గంటలకు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. పవన్ కల్యాణ్ పూజా కార్యక్రమాలు నిర్వహించగా, రవితేజపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి
రేణుదేశాయ్ క్లాప్ ఇచ్చారు. మంత్రి బొత్సా సత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేయగా, వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
కుటుంబ భావోద్వాగాలతో కూడిన ఎంటర్ టైనర్ ఇదని రవితేజ తెలిపారు. పరశురావు దర్శకత్వం వహించిన తొలిచిత్రం 'యువత' తనకు బాగా నచ్చిందనీ, ఆయన చెప్పిన కథ తనకు బాగా నచ్చి ఈ సినిమాలో నటిస్తున్నాననీ అన్నారు. నిర్మాత గణేష్ తనకు మంచి మిత్రుడని తెలిపారు. పరశురామ్ మాట్లాడుతూ, ఆంజనేయులు అనగానే కామెడీ, పవర్ రెండూ ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందనేననీ, ఈ రెండు లక్షణాలు తన చిత్రంలోని ఆంజనేయుడి పాత్రలో ఉంటాయని చెప్పారు. సిటీ నేపథ్యంలో సినిమా ఉంటుందన్నారు. దర్శకుడుగా తనకు ఈ చిత్రంతో బ్రేక్ ఇచ్చిన రవితేకు తన కృతజ్ఞతలనీ, ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాననీ తెలిపారు. నిర్మాతగా తన తొలి సినిమాకు అంగీకరించిన పూరీ జగన్నాథ్, పవన్ కల్యాణ్ లకూ, ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించిన రవితేజకు తన కృతజ్ఞతలని నిర్మాత గణేష్ బాబు పేర్కొన్నారు. ఈ సినిమా తప్పనిసరిగా పెద్ద హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నాననీ, ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందనీ చెప్పారు. ఈ చిత్రంలో రవితేజకు జోడిగా నయనతార నటించనుంది. తమన్ ఎంస్ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|