కాంతారావుకు పరిశ్రమ నివాళి
హైద్రాబాద్ : నటప్రపూర్ణ టి.ఎల్.కాంతారావు అంతిమయాత్ర లో పరిశ్రమ ప్రముఖులంతా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఆయన యశోదా ఆసుపత్రిలో కాంతారావు తుదిశ్వాస విడిచారు. దీంతో పరిశ్రమ యావత్తూ విషాదంలో మునిగిపోయింది. సోమవారం ఉదయం నల్లకుంటలోని ఆయన నివాసంలో అభిమానుల సందర్శార్ధం ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. అనంతరం 10 గంటలకు ఆయనను పరిశ్రమ ప్రముఖులంతా చివరిసారిగా సందర్శించుకునేందుకు గాను హైద్రాబాద్ లోని ఫిలిం చాంబర్ కు తరలించారు. పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, టి.సుబ్బరామిరెడ్డి, కృష్ణ-విజయనిర్మల దంపతులు, దాసరి నారాయణరావు, నన్నపనేని రాజకుమారి, లక్ష్మీపార్వతి, నాగబాబు, మురళీ మోహన్, కైకాల సత్యనారాయణ, సి.నా.రె., డివిఎస్ రాజు, డి.రామానాయుడు, వి.బి.రాజేంద్రప్రసాద్, ఎం.ఎస్.రెడ్డి, కె,ఎస్.రామారావు, విజయ్ చందర్, తమ్మారెడ్డి భరద్వాజ, గిరిబాబు, రమాప్రభ, గీతాంజలి, కవిత, పరుచూరి గోపాలకృష్ణ, బ్రహ్మానందం, వేణుమాధవ్, కాదంబరి కిరణ్, శివాజీ రాజీ, ఆహుతి ప్రసాద్ తదితరులు కాంతారావు భౌతిక కాయానికి అంతిమ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ఓదార్పు పలికారు.
Be first to comment on this News / Article!
|