బ్యాంకాక్ కు 'అధినేత'
ప్రైమ్ స్టార్ జగపతిబాబు హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న రాజకీయ సంచలన చిత్రం 'అధినేత'. వి.సుమద్ర దర్శకుడు. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయినట్టు నిర్మాత రాధామోహన్ వెల్లడించారు.
నేటి సమకాలీన రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టే చిత్రంగా 'అధినేత' రూపొందుతోందని ఆయన చెప్పారు. ఇటీవల క్లైమాక్స్ సన్నివేశాలను ఖమ్మంలో 20 వేల మంది పైగా జనం మధ్య, హెలికాఫ్టర్, వందలాది ఆటోలతో ప్రధాన తారాగణంతో భారీ ఎత్తున చిత్రీకరించినట్టు ఆయన తెలిపారు. ఈనెల 24 వరకూ జరిగిన షెడ్యూల్స్ తో రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయినట్టు చెప్పారు. 25 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ బ్యాంకాక్, పటాయ్, పుకెట్ ఐలాండ్ లలో ఈ రెండు పాటలు చిత్రీకరించడంతో సినిమా పూర్తవుతుందన్నారు. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, ఏప్రిల్ 10న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ చెప్పారు. జగపతిబాబు నటిస్తున్న పవర్ ఫుల్ పొలిటిటికల్ ఫిల్మ్ ఇదని దర్శకుడు సముద్ర తెలిపారు. ఎక్కడా రాజీపడకుండా భారీ ఎత్తున ఈ చిత్రం రూపొందుతోందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సెన్సేషన్ హిట్ అవుతుందనీ అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో శ్రద్దాదాస్, హంసనందిని, ఆహుతిప్రసాద్, ఆనంద్ రాజ్, డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, చలపతిరావు, కృష్ణ భగవాన్, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ కథ-మాటలు, ప్రసాద్ బాబు సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్, డిఫరెంట్ డానీ ఫైట్స్, శ్రీకాంత్ దేవా సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|