'అనంతపురం 1980'
తమిళంలో విజయవంతమైన 'సుబ్రమణియపురం' చిత్రాన్ని తెలుగులో 'అనంతపురం 1980' పేరుతో అనువదిస్తున్నారు. సింహపురి టాకీస్ పతాకంపై ఎం.నరేంద్ర సమర్పణలో ఎం.రఘునాథ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శశికుమార్ దర్శకత్వంతో పాటు హీరో పాత్రను కూడా పోషించారు. 'అష్టాచమ్మ' కథానాయిక, తెలుగుమ్మాయి కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
స్నేహం, ప్రేమ, పగ, ప్రతీకారం అనే అంశాల చుట్టూ కథ తిరుగుతుందనీ, 1980 కాలం నేపథ్యంగా కథ ఉంటుందనీ నిర్మాతలు తెలిపారు. నాటి వాతావరణం, జీవన శైలి ప్రతిబింబించేలా ఈ చిత్రం ఉంటుందన్నారు. ఇదెంత మాత్రం ఫ్యాక్షన్ సినిమా కాదనీ, మన అనంతపురం వాతావరణాని చిత్ర కథ, నేపథ్యం దగ్గరగా ఉండటంతో ఆ పేరు పెట్టామనీ చెప్పారు. నటీనటులంతా చక్కటి ప్రతిభతో ప్రేక్షకులను అలరిస్తారని చెప్పారు. కొంత మంది రాజకీయ నాయకులు పన్నిన ఉచ్చులో ఐదుగురు యువకులు ఎలా చిక్కుకున్నారనేది ఈ చిత్రంలో ప్రధానాంశమనీ, సినిమా ప్రథమార్థం హాయిగా నవ్వుకునే సన్నివేశాలతోనూ, ద్వితీయార్థం మాస్ ఎలిమెంట్స్ తోనూ ఉంటుందని దర్శకుడు శశికుమార్ వివరించారు. ఈ చిత్రానికి శశాంక్ వెన్నెలకంటి మాటలు, వెన్నెలకంటి పాటలు, జేమ్స్ వంసత సంగీతం సమకూర్చారు.
Be first to comment on this News / Article!
|