బాలుకు 'తానా' లైఫ్ టైమ్
గాన గంధర్వ, పద్మశ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం (ఎస్.పి.బాలు) ప్రతిష్ఠాత్మక 'తానా' లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలు ఈసారి జూలై 2 నుంచి మూడు రోజుల పాటు షికాగో రోజ్ మాండ్ కన్వెన్షన్ సెంటర్ లో కన్నుల పండువగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలో ఎస్.బాలసుబ్రమణ్యం లైఫ్ టైమ్ అవార్డును అందుకుంటారు. ఈసారి తానా 17వ మహాసభలకు జూనియర్ ఎన్టీఆర్, ఛార్మి తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు.
తెలుగు నేలకు కీర్తి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖులను రెండేళ్లకు ఒకసారి 'తానా' సభల్లో లైఫ్ టైమ్ అచీమ్ మెంట్ అవార్డుతో సత్కరిస్తున్నారు. ఎస్.పి.బాలసుబ్రమణ్యం గాయకుడుగా, నటుడుగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా బహుముఖ ప్రజ్ఞావంతులు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో 40,000కు పైగా పాటలు పాడారు. గతంలో 'తానా' లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్న ప్రముఖులలో పి.సుశీల, వెంపటి చినసత్యం, రామానాయుడు, ప్రొఫెసర్ సి.ఆర్.రావు, వేల్చేరు నారాయణరావు, గుమ్మడి వెంకటేశ్వరరావు ఉన్నారు.
Be first to comment on this News / Article!
|