శర్వానంద్ తో పద్మప్రియ
'ఆ నలుగురు', 'మధుమాసం' వంటి హిట్ చిత్రాల దర్శకుడు చంద్రసిద్దార్ధ తాజాగా ఫిల్మోత్సవ్ బ్యానర్ పై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రాన్ని ఇటీవల ప్రారంభించారు. శర్వానంద్ హీరో. తాజాగా శర్వానంద్ సరసన పద్మప్రియను హీరోయిన్ గా ఎంపిక చేశారు. పద్మప్రియ ఇప్పటికే తమిళ, మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుని మూడుసార్లు ఉత్తమ నటిగా కేరళ ప్రభుత్వ అవార్డులు అందుకుంది. ఇటీవలే అనువాద చిత్రం 'మృగం'లోనూ నటించింది. చంద్రసిద్దార్థ సినిమా ఆమెకు తొలి తొలుగు స్ట్రయిట్ చిత్రం కాబోతోంది.
గ్రామం నుంచి పట్టణం వరకూ ఓ యువకుడు జరిపే జర్నీ ఈ చిత్రమని చంద్ర సిద్దార్ధ తెలిపారు. ఇద్దరు తండ్రీ కొడుకులు ఎవరు నమ్మిన సిద్దాంతాన్ని వారు పాటిస్తుంటారనీ, మంచి ప్రేమకథాంశం కూడా ఇందులో ఉంటుందనీ తెలిపారు. శర్వానంద్, పద్మప్రియల జోడి కన్నులపండువగా ఉంటుందని చెప్పారు. రచయిత్రి బలభద్రపాత్రుని రమణి ('మధుమాసం' ఫేమ్ ) ఈ చిత్రానికి కథ అందించారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చంద్రసిద్దార్ధ తెలిపారు. ఈ చిత్రానికి చైతన్య ప్రసాద్ పాటలు, అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు. చంద్రసిద్దార్ధ నిర్మించిన 'హౌస్ ఫుల్' విడుదలకు సిద్ధమవుతుండగా, శర్వానంద్ హీరోగా నటించిన 'రాజు మహారాజు' సమ్మర్ సీజన్ ను టార్గెట్ చేసుకుంది.
Be first to comment on this News / Article!
|