ఐటెం బాంబ్ గా ప్రీతి
పాపులర్ నీరిమా శాండిల్ గాళ్ ప్రీతి జింగ్యాని మరోసారి తెలుగు తెరపై తన అందాలతో అలరించేందుకు ముస్తాబవుతోంది. సన్ రేస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజశేఖర్ నర్మిస్తున్న 'తేజం' చిత్రంలో ఓ స్పెషల్ ఐటెం సాంగ్ లో ఆమె నర్తిస్తోంది. రాజ్ కె.ఎస్.గోపి దర్శకుడు.
ప్రీతి జింగ్యాని తొలిసారి 'తమ్ముడు' (1999)లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 'నరసింహనాయుడు'లో బాలకృష్ణతోనూ రొమాన్స్ చేసింది. ఇటీవల ఓ బాలీవుడ్ హీరోను కూడా పెళ్లాడింది. పెళ్లి తర్వాత కూడా ప్రీతి నటిస్తోంది. 'తేజం' చిత్రంలోని ఓ పబ్ సాంగ్ లో ప్రస్తుతం ప్రీతి నర్తిస్తోంది. హైద్రాబాద్ లోని ఓ పబ్ లో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. 'పికాసో గీసెను మా అందమే' అనే పల్లివితో సాగే ఈ పాటలో ప్రీతి, పలువురు డాన్సర్లు పాల్గొంటున్నారు. మ్యూజిక్ ట్రాక్ ను గణ కంపోజ్ చేయగా, వేణు పాల్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో తాను ఐటెంసాంగ్ లో కనిపిస్తాననీ, కథలో ప్రాధాన్యం ఉంటే ఐటెం సాంగా లేక మరొకటా అని ఆలోచించకుండా నటించడానికి అభ్యంతరం లేదని ప్రీతి తెలిపింది. ఎనిమిది మంది హీరోలు, ఒక హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రం టాకీ 90 శాతం పూర్తయిందనీ, ఈనెలలో ఆడియో, ఏప్రిల్ లో సినిమా విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.
Be first to comment on this News / Article!
|