'ఆకాశమంత' ఆడియో
ప్రకాష్ రాజ్ , త్రిష తండ్రీకూతుళ్లుగా రాధామోహన్ దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన 'ఆకాశమంత' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో మంగళవారం సాయంత్రం జరిగింది. సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, దేవీశ్రీ ప్రసాద్, మిక్కీ జె.మేయర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యాసాగర్ సంగీతం అందించిన
ఈ చిత్రం ఆడియోను ఆర్.పి.పట్నాయక్ ఆవిష్కరించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
దిల్ రాజు మాట్లాడుతూ, తన బ్యానర్ లో వస్తున్న 8వ చిత్రమిదనీ, ఈ బ్యానర్ కు పనిచేసిన సంగీత దర్శకులందరితో ఆడియో విడుదల చేయాలనే ఉద్దేశంతో వారినందరినీ ఆహ్వానించామనీ చెప్పారు. 'పరుగు' చిత్రం షూటింగ్ లో ఉన్నప్పుడే ప్రకాష్ రాజ్ ఈ చిత్ర కథను తనకు చెప్పారనీ, కథ నచ్చి తాను తెలుగు వెర్షన్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాననీ చెప్పారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈ చిత్రంలో కొన్ని మార్పులు చేశామనీ, రెండు పాటలు అదనంగా చేర్చామనీ చెప్పారు. సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయని అన్నారు. సినిమా చూసి సెన్సార్ వారు కూడా చాలా బాగుందని అభినందించారనీ, ఈనెల 27న ఉగాది కానుకగా సినిమా రిలీజ్ చేస్తున్నామనీ చెప్పారు. దిల్ రాజుకు వంద శాతం హిట్ రికార్డ్ ఉందనీ, ఆయన తీసిన తొలిచిత్రం 'దిల్' కు తాను సంగీతం అందించడం సంతోషంగా ఉందనీ చెప్పారు. ఆకాశమంత చిత్రం పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. గేయరచయిత అనంత్ శ్రీరామ్, సహనిర్మాతలు శిరీష్, లక్ష్మణ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|