'టార్గెట్ ' పాటలొచ్చాయి...
ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో శివబాలాజీ, శ్రద్ధాదాస్ జంటగా సంగిశెట్టి దశరథ, బి.రామకృష్ణ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'టార్గెట్'. రమేష్ రాజా దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఫిలిం ఛాంబర్ లో మంగళవారం సాయంత్రం జరిగింది. ముమైత్, శివజాలాజీ, చిత్ర సంగీత దర్శకుడు కోటి, సంగిశెట్టి దశరథ, బి.రామకృష్ణ, రమేష్ రాజా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఘంటా శ్రీనివాస్, సమర్పకుడు రామకృష్ణ గౌడ్, సీనియర్ నిర్మాత సి.కల్యాణ్, దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్.వి.కృష్ణారెడ్డి ఆడియో క్యాసెట్ ను ఆవిష్కరించి ముమైత్ ఖాన్ కు అందజేశారు. సి.కల్యాణ్ ఆడియో సీడీని ఆవిష్కరించి కోటికి అందజేశారు. సుప్రీం మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, టైటిల్ కు తగ్గట్టుగానే చిత్రయూనిట్ అంతా ఈ సినిమాను ఓ టార్గెట్ గా తీసుకుని పనిచేశారనీ, వారి కృషికి తగ్గట్టే ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ, రమేష్ రాజా, తానూ గతంలో దర్శకత్వ శాఖలో కలిసి పనిచేశామనీ, మంచి టాలెంట్ ఉన్న దర్శకుడనీ ప్రశంసించారు. ముమైత్ ఖాన్ ను మరో విజయశాంతి అనుకోవచ్చని అన్నారు. అందరికీ ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టాలని అభిలషించారు. కోటి మాట్లాడుతూ, కథ వినగానే సినిమా చాలా బాగుంటుందని అనిపించిందనీ, అందుకు తగ్గట్టే సినిమా చాలా బాగా వచ్చిందనీ చెప్పారు. ముమైత్ మాట్లాడుతూ, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అంతా కష్టపడి పనిచేశారనీ, ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని తాను కూడా ఎదురు చూస్తున్నాననీ చెప్పారు.
Be first to comment on this News / Article!
|