చెన్నైలో 'హాలిడేస్'
మనిషి జీవితంలో ఎన్నో మజిలీలు ఉంటాయి. అలాంటి అందమైన మలుపుల సమాహారమే మా 'హాలిడేస్' అని చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.కుమార్ తెలిపారు. శివనాగ్, భార్గవి, సానియా హీరోహీరోయిన్లుగా ఆర్.సి.ఎం. సినీ చిత్ర పతాకంపై ఎ.రామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక పాట, కామెడీ సాంగ్ మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం చెన్నైలో బ్యాలెన్స్ పార్ట్ చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రేమ, స్నేహం, ఆనందం, భావోద్వేగాలు వంటి అంశాలను ఈ చిత్రంలో పొందుపరచామనీ, చక్కటి సాహిత్యం, ఇంపైన సంగీత ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందనీ దర్శకుడు కుమార్ తెలిపారు. బ్యాలెన్స్ పార్ట్ ను శరవేగంగా పూర్తి చేయనున్నట్టు చెప్పారు. ఇంతవరకూ అరకు, వైజాగ్, తుని, రాజమండ్రి, పాలకొల్లు, పోడూరు పరిసర ప్రాంతాల్లో మూడు షెడ్యూల్స్ పూర్తి చేసినట్టు నిర్మాత రామిరెడ్డి తెలిపారు. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకుంటాయని అన్నారు. చెన్నైలో బ్యాలెన్స్ పార్ట్ పూర్తి చేసి ఏప్రిల్ మొదటి వారంలో ఆడియో, మే నెలల సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జయప్రకాష్ రెడ్డి, ఎల్.బి.శ్రీరాం, రవిప్రకాష్, జెమినీ రాఘవ, పింగ్ పాంగ్, పృధ్వీ, హంసి, అదితి, స్వాతి తదితరులు నటిస్తున్నారు. రామస్వామి-కోడి ఎన్.ప్రసాద్ మాటలు, కల్యాణ్ సమి సినిమాటోగ్రఫీ, సాయిశ్రీనివాస్ ఎడిటింగ్, శ్రీధర్ శ్రీకాంత్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|