65 ప్రింట్లతో 'బుద్ధిమంతుడు'
ఉపేంద్ర, సలోని, పూజా గాంధీ హీరోహీరోయిన్లుగా కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రం 'బుద్ధిమంతుడు'గా అనువాదమై ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలాజీ ప్రొడక్షన్స్ పతాకంపై గాలి జనార్థన రెడ్డి సమర్పణలో హెచ్.లక్ష్మీకాంతరెడ్డి, పి.హనుమంత రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రామ్ నాథ్ దర్శకుడు. ఉగాది కానుకగా ఈనెల 27న ఈ చిత్రాన్ని విడుదుల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. హైద్రాబాద్ లో బుధవారంనాడు ఆ విశేషాలను వారు తెలియజేశారు.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉందనీ, ఆయన నటించిన అనువాద చిత్రాలతో పాటు, స్ట్రయిట్ చిత్రాలు సైతం గతంలో విజయవమంతమయ్యాయనీ నిర్మాత హనుమంతరెడ్డి తెలిపారు. కన్నడంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ ప్రేక్షకులను అలరిస్తుందనే గట్టి నమ్మకం తనకుందన్నారు.ఇప్పటికే ఆడియోకి మంచి స్పందన లభించిందనీ, రవివర్మ..అనే రీమిక్స్ పాటకు ఎంతో ఆదరణ లభిస్తోందని చెప్పారు. ఈ చిత్రాన్ని 65 ప్రింట్లతో 100కు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నామనీ, ఒక్క హైద్రాబాద్ లోనే 25 థియేటర్లలో రిలీజ్ కానుందనీ తెలిపారు. సురేష్ మూవీస్ ద్వారా తామే సొంతంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. సినిమా విడుదలైన తొలిరోజున ఉపేంద్ర హైద్రాబాద్ లోని కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్ తదితర థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తారని వెల్లడించారు.
Be first to comment on this News / Article!
|