చిత్తూరు నాగయ్య విగ్రహం
'భక్తిపోతన', 'యోగి వేమన', 'త్యాగయ్య' వంటి అజరామరమైన పాత్రలకు జీవం పోసిన అలనాటి ప్రముఖ నటుడు స్వర్గీయ చిత్తూరు వి.నాగయ్య ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆ మహానటుడి జ్ఞాపకాలను పదిలం చేస్తూ ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని హైద్రాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ఉగాది పర్వదినమైన ఈనెల 27వ తేదీ ఉదయం 11.30 గంటలకు ప్రజా సమక్షంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని పద్మశ్రీ చిత్తూరు వి.నాగయ్య మెమోరియల్ కమిటీ అధ్యక్షురాలు అంజలీదేవి తెలిపారు.
నటుడుగా, గాయకుడుగా, సంగీత నిర్దేశకుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా, స్వాంతంత్ర్య సమరయోధుడుగా, మానవతా మూర్తిగా నాగయ్య చేసిన సేవలసు చిరస్మరణీయమని ఆమె తెలిపారు. నాగయ్య 105 వ జయంతిని పురస్కరించుకుని చలన చిత్ర రంగానికి ఎనలేని సేవలందించిన పలువురు ప్రముఖులను ముఖ్యమంత్రి సత్కరిస్తారని ఆమె వివరించారు.
Be first to comment on this News / Article!
|