'శ్రీ షిర్డీ సాయిబాబా' ఆడియో
బి.వి.రెడ్డి టైటిల్ పాత్ర పోషిస్తూ ఎస్.ఆర్.ఆర్.క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన భక్తిరస ప్రధాన చిత్రం 'జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబు'. జి.రామకృష్ణ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. హైద్రాబాద్ ఫిలించాంబర్ లోని నిర్మాతల మండలి హాలులో బుధవారం ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బరామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఎస్.ఆర్.ఆర్. ఆడియోస్ ద్వారా ఈ ఆడియో విడుదలైంది.
సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ, కలియుగంలో ప్రజల ప్రత్యక్షంగా చూసిన దేవుడు షిర్డీ సాయిబాబా అనీ, కోట్లాది మంది భక్తులకు ఆయనంటే ఎంతో నమ్మకం ఉందనీ చెప్పారు. బి.వి.రెడ్డి షిర్డీ సాయిగా నటించి నిర్మించిన ఈ చిత్రం ఆడియోతో పాటు సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. పాత్రలకు తగిన ఆర్టిస్టులతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం తనకుందని ఫిలిం ఛాంబర్ అద్యక్షుడు కె.ఎస్.రామారావు పేర్కొన్నారు. ధర్మానికి విఘాతం కలిగినప్పుడల్లా భగవంతుడు అవతారం దాలుస్తాడనీ, నాటి సాంఘిక, సామాజిక పరిస్థితుల్లో మార్పు కోసం భగవంతుడే సాయిబాబాగా అవతరించారని బివి రెడ్డి పేర్కొన్నారు. అలాంటి మహనీయుని చరిత్రను తెరకెక్కించడం ఎనలేని ఆనందాన్నిచ్చిందని అన్నారు. పాటలన్నీ చాలా బాగా కుదిరాయని పేర్కొన్నారు. పాత్రలకు తగిన నటులను ఎంపిక చేశామనీ, సినిమాలోని కీలకమైన నానావళి పాత్రను నటుడు శివకృష్ణ పోషించారనీ దర్శకుడు రామకృష్ణ తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందనీ, ఏప్రిల్ లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు బి.గోపాల్, ఎస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాతలు కె.సి.శేఖర్ బాబు, అర్జునరాజు, నటుడు చిట్టిబాబు, దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|