మనోజ్ కుమార్ 'ప్రయాణం'
'ఐతే', 'అనుకోకుండా', 'ఒక్కడున్నాడు' వంటి చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ యేలేటి తన తాజా చిత్రాన్ని హ్యామరస్ గా సాగే అవుడ్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా తీర్చిదిద్దుతున్నారు. మలేషియా ఎయిర్ పోర్ట్ లో మూడున్నర గంటల సమయంలో జరిగే ఇతివృత్తమిది. మంచు మనోజ్ కుమార్, హారిక (తొలి పరిచయం) జటంగా ప్రచారార్భాటాలకు దూరంగా రూపొందుతున్న ఈ చిత్రానికి 'ప్రయాణం' అనే టైటిల్ ను ఖరారు చేశారు.
మలేసియా నుంచి ఇండియాకు రావాలనుకున్న ఓ అమ్మాయి, అక్కడి నుంచి సింగపూర్ వెళ్లాలనుకున్న ఓ అబ్బాయి మధ్య ఎయిర్ పోర్ట్ లో పరిచయమవుతుందనీ, వారిద్దరి మధ్య ఇంటరాక్షన్, కన్ఫూజన్లు...ఇలా సినిమా ఆద్యంతం చాలా సరదాగా ఉంటుందనీ చంద్రశేఖర్ యేలేటి తెలిపారు. మూడున్నర గంటల తక్కువ సమయంలో ఇద్దరి మధ్య లవ్ ఏర్పడటం, చివరకు వారు ఒకటి అవ్వడం కన్విన్సింగ్ గా చెప్పగలిగామనీ, గతంలో పలు థ్రిల్లర్ల్ చేసిన్నప్పటికీ ఈ సినిమా ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని తెరకెక్కిస్తున్నామనీ చెప్పారు. మనోజ్ టెరిఫిక్ ఫెర్ ఫారమెన్స్ , బెంగాళీ అమ్మాయి హారిక నటన, ప్రయాణంలో ప్యాసింజర్ గా కనిపించే బ్రహ్మానందం హాస్యం ప్రేక్షకులకు చక్కిటి అనుభూతినిస్తాయన్నారు. సినిమాలో 70 శాతం విమానాశ్రయంలోనే కథంతా నడుస్తుందనీ, నిర్మాణాంతర కార్యక్రమాలు ముగించి
ఏప్రిల్ నెలాఖరులో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు. యేలేటి సొంతంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ, మహేష్ శంకర్ ('వెన్నెల' ఫేమ్) సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|