ఎఫ్ఎంలో 'మనోరమ' సాంగ్స్
ఛార్మి కథానాయికగా జీ మోషన్ పిక్చర్స్ పతాకంపై వి.ఈశ్వర్ రెడ్డి ('మీ శ్రేయోభిలాషి' ఫేమ్ ) దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ చిత్రం 'మనోరమ'. ఉగాది కానుకగా ఈనెల 27న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో బేగంపేటలోని బిగ్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ లో బుధవారం సాయంత్రం ఆడియో సీడీ విడుదల కార్యక్రమం జరిగింది. ఛార్మి, ఈశ్వర్ రెడ్డి, సంగీత దర్శకుడు కోటి, పాటల రచయితలు వెనిగెళ్ల రాంబాబు, మాస్టార్జీ, జీ మోషన్ ప్రతినిధి సురేష్ తదితరులు పాల్గొన్నారు. కోటి ఆడియోను విడుదల చేసి తొలి ప్రతిని ఛార్మికి అందజేశారు.
ఛార్మి మాట్లాడుతూ, ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని అంటున్నారనీ, 27న సినిమా రిలీజ్ అవుతుండటంతో కంటిమీద కునుకురావడం లేదనీ అన్నారు. 'మంత్ర' సినిమాలో 'మహా మహా' పాట ఎంత హిట్టయిందో అందరికీ తెలిసిందనీ, ఇందులోనూ ఆ తరహా సాంగ్ ఉందనీ చెప్పారు. ప్రేమలో పడాలంటే గట్స్ ఉండాలని ఈ సినిమాలో చూపించడం జరిగిందనీ, సినిమా మంచి సక్సెస్ ను సాధిస్తుందనే గట్టి నమ్కకంతో ఉన్నాననీ అన్నారు. సినిమాలో మూడు పాటలు పాత్రమే ఉన్నాయనీ కోటి తెలిపారు. రీరికార్డింగ్ కు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. ఇందులో ఛార్మి చాలా చక్కగా నటించిందనీ, సినిమాలోని థీమ్ సాంగ్ కు తాను గాత్రం అందించాననీ చెప్పారు. ఈ సినిమా వైవిధ్యంతో కూడిన కమర్షియల్ థ్రిల్లర్ అని అన్నారు. దర్శకుడు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, సెన్సార్ సభ్యులను ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటుందనీ, సినిమా రిలీజ్ తర్వాత తమకు ఒక ప్రింట్ ఇస్తే సెన్సార్ బోర్డు మెంబర్లందరికీ చూపిస్తామని కోరారనీ తెలిపారు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చనే థీమ్ తో సినిమా రూపొందిందనీ, ఇందులో చార్మికి ఇతరుల పెదవుల కదలికను బట్టి వారు ఏమి మాట్లాడుతున్నారో చెప్పగలిగే ప్రతిభ ఉంటుందని అన్నారు.
Be first to comment on this News / Article!
|