'వరుడు'కోసం 2 కోట్ల సెట్
ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ చిత్రాన్ని తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీగా రూపొందిస్తున్నట్టు ఆ చిత్ర నిర్మాత సింగనమల రమేష్ తెలియజేశారు. ఎస్.సత్యరామ మూర్తి సమర్పణలో కనకరత్న మూవీస్ పతాకంపై సింగనమల రమేష్ నిర్మిస్తున్న 'ప్రొడక్షన్ నెంబర్-2' చిత్రం రెగ్యులర్ షూటింగ్ అన్నపూర్ణా స్టూడియోస్ లో బుధవారం ప్రారంభమైంది.
సింగనమల రమేష్ ఆ విశేషాలను తెలియజేస్తూ, మహేష్-త్రివిక్రమ్ సూపర్ కాంబినేషన్ లో సెన్సేషనల్ హిట్ తియ్యాలనే అభిప్రాయంతో ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. 25 నుంచి జూన్ నెలాఖరు వరకూ హైద్రాబాద్ లో జరిగే నాన్ స్టాప్ షెడ్యూల్ తో సగం సినిమా పూర్తవుతుందన్నారు. ఈ షెడ్యూల్ కోసం గండిపేట దగ్గర 2 కోట్ల రూపాయల వ్యంతో విలేజ్ సిటీ నిర్మిస్తున్నామనీ, అత్యంత వ్యయంతో రాజస్థాన్ టెంపుల్ సెట్ కూడా వేస్తున్నామనీ చెప్పారు. జూలై షెడ్యూల్ దక్షిణాఫ్రికాలోని నమీబియాలో, ఆగస్టు షెడ్యూల్ రాజస్థాన్ లో, సెప్టెంబర్ లో ఇటలీలో సాంగ్స్ చేయడంతో దాదాపు సినిమా పూర్తవుతుందని తెలిపారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్టు చెప్పారు. 'పోకిరి'తో రికార్డులు సృష్టించిన మహేష్, 'అరుంధతి'తో సంచలనం సృష్టించిన అనుష్క, 'జల్సా'తో మరిన్ని రికార్డులు నెలకొల్పిన త్రివిక్రమ్ కాంబినేషన్ లో తమ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ చిత్రం గొప్ప సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం తనకుందన్నారు. 'అతడు' వంటి హిట్ తర్వాత త్రివిక్రమ్ చెప్పిన సబ్జెక్ట్ తనకు బాగా నచ్చడంతో ఎంతో ఇష్టపడి చేస్తున్న సినిమా ఇదని మహేష్ తెలిపారు. ప్రేక్షకాభిమానులను అలరించే అన్ని అంశాలు, ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రం ఉంటుందని అన్నారు. అనుష్క మాట్లాడుతూ, మహేష్ బాబుతో కలిసి తాను నటిస్తున్న తొలి చిత్రమిదనీ, కథ చాలా ఆసక్తికరంగా ఉందనీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తుండటం హ్యాపీగా ఉందనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, ఆలీ, నాజర్, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు, తనికెళ్ల భరణి, షఫీ, సునీల్ శర్మ, సుధ, శ్రీరంజని తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే తివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండగా, సునీల్ పటేల్ సినిమాటోగ్రఫీ, విజయన్ ఫైట్స్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఆనంద్ సాయి కళాదర్శకత్వం, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.
Be first to comment on this News / Article!
|